శివగామి రమ్యకృష్ణ అలా అడ్జస్టయిందా... అలాగే ఉండాలంటోంది

Published : May 12, 2017, 02:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
శివగామి రమ్యకృష్ణ అలా అడ్జస్టయిందా... అలాగే ఉండాలంటోంది

సారాంశం

కాస్టింగ్ కౌచ్ పై అభిప్రాయం వెల్లడించిన రమ్యకృష్ణ ఎదగాలంటే అడ్జస్ట్ అవాల్సిందేనని కుండబద్దలు కొట్టిన రమ్యకృష్ణ రమ్య బోల్డ్ స్టేట్ మెంట్ తో అడ్జస్ట్ మెంట్ గురించి అభిమానుల్లో ఆలోచన సోషల్ మీడియాలో రమ్యకృష్ణ స్టేట్ మెంట్ గురించి తెగ చర్చలు  

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఆఫర్లు రావాలంటే హీరోలు,నిర్మాత‌ల‌,ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళ్ళాల్సిందేనా. అలా వెళ్తేనే ఆఫర్లతో పాటు క్రేజీ ఆఫర్లు కూడా దక్కుతాయా. అంటే అవుననే సమాధానమిస్తున్నారు పలువురు హీరోయిన్లు. చాలా మంది అలాంటివి మేము కూడా ఎదుర్కున్నామంటూ కొంతమంది హీరొయిన్లు సోషల్‌ మీడియాలో ఓపెన్‌ గా చెప్పారు.

 

తెలుగుసినీ ఇండస్ట్రీలో ఇలాంటి నీచమైన పనులు జరుగుతున్నాయని చాలామంది హీరోయిన్లు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంద‌ని కూడా చెప్పారు. కొంతమంది హీరొయిన్స్‌ ఇలా ఓపెన్‌గా చెప్పడంతో..టాప్‌ హీరోయిన్స్‌ కూడా ఆ విషయంపై రియాక్ట్‌ అయ్యారు. అందులో కొంతమంది ఆ మాటలను అంగీకరించినా..మరికొంతమంది మాత్రం తాము అలాంటి అనుభవాలను ఎదుర్కోలేదని చెప్పారు. అయితే ఈ వ్యవహారం ఇప్పటీకీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

 

ఈ వ్య‌వ‌హారంపై సీనియర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ కూడా నోరు విప్పేసింది. ఈ వ్య‌వ‌హారంపై ర‌మ్య‌కృష్ణ రియాక్షన్ కాస్త బోల్డ్‌ గానే ఉందని చెప్పాలి. ఇత‌ర రంగాల మాదిరిగానే సినిమా ఇండ‌స్ట్రీలోనూ అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది ర‌మ్య‌కృష్ణ. అంతేకాకుండా అలా అడ్జ‌స్ట్ అయితేనే సినిమా కెరీర్‌ ఉంటుందని, అప్పుడే హీరోయిన్లు కెరీర్‌లో ముందుకు వెళ‌తార‌ని కూడా బోల్డ్‌ గా చెప్పేసింది ర‌మ్య‌. అయితే అడ్జ‌స్ట్ అవ‌డం, కాక‌పోవడం అనేది వారి వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని కూడా చెప్పింది. 

 

ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులకు ర‌మ్య‌కృష్ణ మాటలపై తెగ డౌట్స్‌ వస్తున్నాయి. ఎందుకంటే..ఇక్క‌డ ర‌మ్య‌కృష్ణ ఉప‌యోగించిన ‘అడ్జ‌స్ట్’ అనే పదానికి అర్థం ఏంటని, ఇత‌ర హీరోయిన్లు చెప్పినట్టుగా సినీ పెద్ద‌ల‌కు లొంగిపోవ‌డమే ‘అడ్జ‌స్ట్’ అనే పదానికి అర్థమా? అంటూ ఫ్యాన్స్‌ తెగ కన్ఫూజ్‌ అవుతున్నారు. మరి రమ్య కూడా అడ్జస్ట్ అయిందా.. రమ్య ఎవరెవరితో ఎలా అడ్జస్ట్  అయిందోనని ఆమె అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?