సుశాంత్ కేసు: చట్టానికి ఎవరూ అతీతులు కాదు, ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Aug 19, 2020, 04:22 PM IST
సుశాంత్ కేసు: చట్టానికి ఎవరూ అతీతులు కాదు, ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

అధికార శివసేనపార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అనడం జరిగింది. సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించాడనికి మద్దతు తెలిపిన సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించడం జరిగింది. దీనితో సుశాంత్ డెత్ మిస్టరీలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు అయ్యింది. సీబీఐ ఎంట్రీతో సుశాంత్ మృతి వెనుక ఉన్న పెద్దలు బయటికి వచ్చే అవకాశం కలదు. సుశాంత్ ది మర్డర్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ముంబై పోలీసులు దానిని సూసైడ్ గా చెప్పడం జరిగింది. ముంబై పోలీసుల విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మన్నిస్తూ సుప్రీమ్ కోర్ట్ ఈ కేసును సీబీఐకి అప్పగించడం జరిగింది. 

దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం తీర్పుపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించడంపై ముంబై కమిషనర్ లేదా అడ్వకేట్ జనరల్ మాట్లాడతారని అన్నారు. ఇక మహారాష్ట్రలో ఉన్నతమైన నయవ్యవస్థ ఉంది, ఇక్కడ చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు.అలాగే ముంబైలో జరిగిన సంఘటనపై బీహార్ లో కేసుపెట్టడాన్ని కూడా ఆయన సమర్ధించారు. సుశాంత్ కి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. 

ఐతే ఈ కేసు విషయంలో బీజేపీ మరియు శివసేన పార్టీల మధ్య వివాదం నడుస్తుంది. బీజేపీ నేతలు సుశాంత్ హత్య చేయబడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై అధికార శివసేన పార్టీ మండిపడుతుంది . సుశాంత్ కేసును బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చుస్తున్నారని ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సుశాంత్ కేసు పట్ల అనుకూలంగా మాట్లాడడం, చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే