కరణ్‌కి ప్రభాస్‌ షాక్‌.. నెపోటిజం కొంపముంచిందా?

Published : Aug 19, 2020, 03:57 PM IST
కరణ్‌కి ప్రభాస్‌ షాక్‌.. నెపోటిజం కొంపముంచిందా?

సారాంశం

ఈ సినిమా ప్రకటనతో బాలీవుడ్‌ అగ్ర నిర్మాత కరణ్‌కి డార్లింగ్‌ భారీ షాక్‌ ఇచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్‌ బాలీవుడ్‌లో చేసే డైరెక్ట్‌ సినిమాకి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా ప్రచారం జరిగింది. ఎందుకంటే `బాహుబలి` సినిమాలను హిందీలో కరణ్‌జోహార్‌ విడుదల చేశారు.

ప్రభాస్‌ తన ప్రస్తుతం తన మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇక బాలీవుడ్‌లో డైరెక్ట్ సినిమాకి ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` పేరుతో సినిమా చేయబోతున్నట్టు నిన్న ప్రకటించారు. దీన్ని టీ సిరీస్‌ ప్రొడక్షన్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. రాముడి కోణంలో పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుంది. టైటిల్‌ పోస్టర్‌ చూస్తుంటే ఇది సూపర్‌ హీరో తరహాలో రూపొందబోతుందని అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రకటనతో బాలీవుడ్‌ అగ్ర నిర్మాత కరణ్‌కి డార్లింగ్‌ భారీ షాక్‌ ఇచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్‌ బాలీవుడ్‌లో చేసే డైరెక్ట్‌ సినిమాకి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా ప్రచారం జరిగింది. ఎందుకంటే `బాహుబలి` సినిమాలను హిందీలో కరణ్‌జోహార్‌ విడుదల చేశారు. దీంతో బాలీవుడ్‌ డైరెక్ట్ ఎంట్రీ చిత్రం వీరి కాంబినేషన్‌లో ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్టుండి టీ సిరీస్‌ తెరపైకి రావడం విశేషం. 

ప్రభాస్‌ నటించిన `సాహో` చిత్రాన్ని హిందీలో టీ సిరీస్‌ విడుదల చేసింది. హిందీ వెర్షన్‌లో టీ సిరీస్‌ భాగస్వామిగా ఉంది. అదే పరిచయం కూడా `ఆదిపురుష్‌` చిత్రాన్ని సెట్‌ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే కరణ్‌కి ప్రభాస్‌ హ్యాండివ్వడానికి పెద్దకారణమే ఉందట. ఇటీవల బాలీవుడ్‌లో నెపోటిజం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఇది మరింత ఊపందుకుంది. 

సుశాంత్‌.. కరణ్‌జోహార్‌ వంటి కొంత మంది నిర్మాతల వల్లే అవకాశాలు చేజార్చుకున్నారనే ప్రచారం జరిగింది. కరణ్‌జోహార్‌ కొత్తవాళ్లకి ఆఫర్లు ఇవ్వడని అన్నారు. పలువురు హీరోయిన్లు కూడా కరణ్‌పై దుమ్మెత్తిపోశారు. దీంతో కరణ్‌పై ప్రస్తుతం నెగటివ్‌ ఇంప్రెషన్‌ ఉంది. ఈ సందర్భంలో ఆయన నిర్మాణంలో సినిమా ప్రకటిస్తే అది తమ చిత్రంపై ప్రభావం పడుతుందని డార్లింగ్‌ సన్నిహితులు భావించారట. ఇదే విషయంలో ప్రభాస్‌కి తెలియడంతో నిర్మాతల విషయంలో కాస్త కేర్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే `ఆదిపురుష్‌` విషయంలో కావాలనే కరణ్‌ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే `సాహో` టైమ్‌ నుంచి వీరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయనే వార్త కూడా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది  చూడాలి. 

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే ప్రభాస్‌ ఈ సినిమాని లైట్‌ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ కూడా అంతగా సందడి చేయలేకపోయింది. సినిమాపై హైప్‌ని తీసుకురావడంలో విఫలమైందనే చెప్పాలి. దీంతో మిగిలిన ప్రాజెక్ట్ లపై ప్రభాస్‌ ఫోకస్‌ పెట్టారట. దీంతోపాటు ఈ `సాహో` స్టార్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా ఎంపిక కావడంతో ఈ సినిమా రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి