సీనియర్ పాటల రచయిత శివ గణేష్ మృతి

Published : Aug 15, 2019, 02:18 PM ISTUpdated : Aug 15, 2019, 02:47 PM IST
సీనియర్ పాటల రచయిత శివ గణేష్ మృతి

సారాంశం

సౌత్ ఇండస్ట్రీలో పాటల రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివ గణేష్ మరణించారు. సినీ పరిశ్రమలకు ఒక్కసారిగా ఈ న్యూస్ షాక్ కి గురి చేసింది. ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాల్లో తనదైన శైలిలో పాటలను అందించిన శివగణేష్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు.   

సౌత్ ఇండస్ట్రీలో పాటల రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివ గణేష్ మరణించారు. సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అందరిని ఈ న్యూస్ షాక్ కి గురి చేసింది. ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాలకు తనదైన శైలిలో పాటలను అందించిన శివగణేష్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. 

వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. ఆయన తుది శ్వాస విడువడంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా శివ గణేష్ తెలుగులో డబ్బింగ్ అయ్యే తమిళ సినిమాలకు పాటలు రాశారు

దాదాపు వెయ్యికి పైగా పాటలు రాసిన శివగణేష్ ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, 7జీ బృందావన్ కాలనీ లాంటి మరచిపోలేని సినిమాలకు కూడా తన సాహిత్యమందించారు. శివగణేష్ కు ఇద్దరు కుమారులున్నారు.

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?