#KalyanRam: ఆశ్చర్యం.. కళ్యాణ్ రామ్ కన్నా దుల్కర్ కే ఎక్కువ బిజినెస్

Published : Aug 03, 2022, 06:09 PM ISTUpdated : Aug 03, 2022, 06:10 PM IST
#KalyanRam: ఆశ్చర్యం.. కళ్యాణ్ రామ్  కన్నా దుల్కర్ కే ఎక్కువ బిజినెస్

సారాంశం

ఆగస్ట్ 5న రోజు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ , దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ థియేటర్స్ లోకి వస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ప్రమోషనల్ వార్ జరుగుతుంది. మరో ప్రక్క బిజినెస్ విషయాల్లోనూ ఈ రెంటిని పోల్చి చూస్తోంది ట్రేడ్.


వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలసిందే. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో  ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. అవి ఒకటి బింబిసార, మరొకటి సీతారామమ్. ఈ రెండు సినిమాల్లో ట్రేడ్ లో క్రేజ్ ఎక్కువ ఎవరికీ అంటే సీతారామమ్ కే అని చెప్పాలి. సీతరామమ్ బిజినెస్ 18 కోట్లు జరగగా, బింబిసార బిజినెస్ 15 కోట్లు మాత్రమే జరిగిందని వినికిడి. ఇది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

ఇక చిత్రాల విషయానికి వస్తే...శరణు కోరితే ప్రాణ భిక్ష. ఎదిరిస్తే మరణం అంటున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన హీరో గా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్‌ కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్‌ అవతారంలోనూ కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్‌ తొలిసారి ఇలాంటి జోనర్‌లో నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

అలాగే  మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. సీతా రామం. మృణాళిని ఠాకూర్‌ హీరోయిన్. రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కనిపించనున్నారు.
  

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే