విజయ్ ‘లైగర్’ నుంచి రొమాంటిక్ సాంగ్ రెడీ.. పోస్టర్ మాత్రం మామూలుగా లేదుగా..

Published : Aug 03, 2022, 05:56 PM IST
విజయ్ ‘లైగర్’ నుంచి రొమాంటిక్ సాంగ్ రెడీ..  పోస్టర్ మాత్రం మామూలుగా లేదుగా..

సారాంశం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ఇప్పటికే  ఈచిత్రం నుంచి పలు సాంగ్స్ రాగా.. తాజాగా రొమాంటిక్ సాంగ్ ను రెడీ చేశారు.   

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన  ‘లైగర్’ (Liger). ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ను అందిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీస్ అయిన లైగర్ పాటలకూ అదే రేంజ్ లో స్పందన లభిస్తోంది. తాజాగా చిత్ర  యూనిట్ మరో రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. 

తాజా సమాచారం ప్రకారం.. లైగర్ నుంచి ‘ఆఫత్’(Aafat) అనే టైటిల్ తో ఓ రొమాంటిక్ సాంగ్ కు రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు సాంగ్ ప్రొమోను రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 5న ఉదయం 9 గంటలకు ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. దీంతో లైగర్ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అనౌన్స్ మెంట్ చేస్తూ విడుదల చేసిన సాంగ్ పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. సముద్రాన్ని చూస్తున్న లైగర్ జోడీ.. ప్రపంచాన్ని మరిచి మరో వరల్డ్ లోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే లైగర్ నుంచి వచ్చిన ‘ద లైగర్ హంట్ థీమ్’, ‘అక్డి పక్డి’, ‘వాట్ లగా దేంగే’ యూట్యూబ్ లో దూసుకుపోతున్నారు. 

చిత్రంలో ముంబై చాయ్ వాలా నుంచి ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎదిగిన పాత్రలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) జంటగా నటిస్తోంది. మూవీ ప్రమోషన్స్ ను లైగర్ జోడీ ఇఫ్పటికేగా క్రేజీగా కొనసాగిస్తోంది. దీంతో సినిమాపై రిలీజ్ కు ముందే హిట్ టాక్ క్రియేట్ అయ్యింది. రెండేండ్లుగా రౌడీ అభిమానులు సినిమా కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మిగతా భాషల్లోనూ విడుదల చేయనున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?