Nagababu: వాడంత ఎదవ మరొకడు ఉండడు... అయినోళ్ళను నాగబాబు అంత మాట అనేశాడేంటీ!

Published : Aug 06, 2022, 01:12 PM IST
Nagababu: వాడంత ఎదవ మరొకడు ఉండడు... అయినోళ్ళను నాగబాబు అంత మాట అనేశాడేంటీ!

సారాంశం

నటుడు నాగబాబు వాళ్ళను ఎదవలుగా అభివర్ణించాడు. సన్నిహితులను ఆయన అంత మాట అనడం ఆసక్తికరంగా మారింది. నాగబాబు ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.   


నటుడు నాగబాబు(Nagababu) పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు కొన్నాళ్ళు పార్టీని, దాని కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోలేదు. ఓ ఏడాది కాలంగా ఆయన సీరియస్ పొలిటీషియన్ గా టర్న్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆ పార్టీ అజెండాను భుజాన మోస్తున్నాడు. జనసేన పార్టీలో పవన్, నాదెండ్ల తర్వాత మూడవ స్థానం నాగబాబుదే అని చెప్పాలి. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు జనసేన(Janasena) భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీలపై సెటైర్స్, కౌంటర్లు పోస్ట్స్ చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక సొంతగా నాగబాబు కొట్టే కోట్స్, పోస్ట్ చేసే డైలాగ్స్ జనసైనికులలో ఉత్సాహం నింపుతూ ఉంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ.. ''కోల్పోవడానికి ఏమీ లేని వాడితో యుద్ధం ప్రమాదకరం''  అంటూ ట్వీట్ చేశాడు. కోట్ల మంది అభిమానులు, వందల కోట్ల ఆస్తులు, మెగా ఫ్యామిలీ అనే కల్పవృక్షం, భార్య పిల్లలు ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని ఏమీ లేని వాడిగా నాగబాబు ఏ భావనతో చెప్పాడో అభిమానులకు కూడా అర్థం కాలేదు. 

అంతకంటే తెగించినోడితో యుద్ధం ప్రమాదకరం అన్నా కొంచెం బాగుండేద. ఆ కోట్ పక్కన పెడితే... తాజాగా నాగబాబు తన గురించి తాను గొప్ప ఎలివేషన్ ఇచ్చుకున్నారు. ఆయన ఎవరినైనా వదులుకుంటే వాడు పెద్ద ఎదవ అంటున్నాడు. నాగబాబు తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ఏం రాశారంటే... మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను... ఒకవేళ వదులుకున్నానంటే వాడంత ఎదవ ఎవడు ఉండడు... అని. ఈ పోస్ట్ ఆంతర్యం ఏమిటంటే... నాగబాబు తన సన్నిహితుల్లో ఎవరికో కౌంటర్ వేశాడు. మరీ పెద్ద వెధవ అయితే గాని నేను నా సన్నిహితుడిని దూరం పెట్టను అని ఆయన డైరెక్ట్ గానే చెప్పారు. మరి నాగబాబుకు దూరమైన ఆ వెధవ ఏడవడనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ