
బ్యూటీఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ ‘సీతారామం’ జోడీ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఒక్క సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రేమకథగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కాసుల వర్షం కురిపించింది. ఇంకా వసూళ్లు చేస్తూనే ఉంది.
చిత్రంలో హీరోహీరోయిన్లుగా దుల్కర్, మృణాల్ ఠాకూర్ నటించారు. వైజయంతి మూవీస్ (Vyjanthi Movies) బ్యానర్ పై నిర్మాత అశ్వనీ దత్ నిర్మించారు. దర్శకుడు హనురాఘవపూడి డైరెక్ట్ చేశారు. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా కీలక పాత్రలో నటించింది. మరో ముఖ్య పాత్రను సుమంత్ పోషించారు. చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
అయితే ఈ చిత్రం ఊహించని విధంగా సక్సెస్ అందుకోవడం.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఇదే జంటతో మరోసారి రొమాంటిక్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్, వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ (Ashwini Dutt) క్లారిటీ ఇచ్చారు. మరో ప్రేమకథా చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెండితెరపై ఈ సక్సెస్ పుల్ పెయిర్ ను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన హిందీ చిత్రం ‘చుప్ : రివేంజ్ ఆప్ ది ఆర్టిస్ట్’కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అటు మృణాల్ కూడా సౌత్ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను దక్కించుకుంటోంది.