తెలుగు హీరోయిన్లపై ‘సీతారామం’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. అందుకే తీసుకోలేదంట!

By team teluguFirst Published Dec 20, 2022, 11:15 AM IST
Highlights

రీసెంట్ చిత్రాల్లో సెలైంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘సీతారామం’. తెలుగులో రూపొందించిన  ఈ చిత్రాన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేశారు. అయితే చిత్రంలో తెలుగు హీరోయిన్లను తీసుకోకపోవడంపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
 

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ ‘సీతారామం’ (Sita Ramam). హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీ దత్ నిర్మించిన విషయం తెలిసిందే. రూ.30 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. తొలిరోజే  పాజిటివ్ దక్కడంతో లాంగ్ రన్ లో థియేటర్లలో సందడి చేసింది. మరోవైపు రూ.100 కోట్ల వరకు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది. 

అయితే, తెలుగు బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో ఒక్క తెలుగు హీరోయిన్ లేకపోవడం గమనార్హం. రెండు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కన్నడ బ్యూటీ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించారు. ప్రధాన పాత్రలో యలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మెప్పించారు. సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు  ఓ ఛానెల్ కు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi)ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలుగు హీరోయిన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

తమ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో తెలుగు హీరోయిన్లకు అవకాశం దక్కకపోవడానికి కారణమిదేనని చెప్పొకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘కథకు తగ్గట్టుగా నిర్మాత స్వప్నతో కలిస దుల్కర్ సల్మాన్ ను హీరోపాత్రలో ఎంపిక చేశాం. హీరోయిన్ విషయంలో సీతపాత్రకు సరిపడా తెలుగు యాక్ట్రెస్ ప్రొఫైల్ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఎలాంటి డిటేయిల్స్ కూడా లభించలేదు. దీంతో వెంటనే మృణాల్ ను ఎంపిక చేశాం.  తెలుగు అమ్మాయి దొరికితే ఇంకా హాయిగా ఉండేది.. వారికి తెలుగు భాష తెలిసిఉండటంతో భావం ఇట్టే అర్థమయ్యేది.’ అని చెప్పుకొచ్చారు. ‘అందాల రాక్షసి’,‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడిపడి లేచే మనసు’ వంటి బ్యూటీఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేశారు హను రాఘవపూడి. ‘సీతారామం’ సక్సెస్ కావడంతో నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా 2022లో వైజయంతి బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ - పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ‘ప్రాజెక్ట్ కే’ను రూపొందిస్తున్నారు. రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఆధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది సినిమా నుంచి వరుస అప్డడేట్స్ అందనున్నాయి.

click me!