''రా మంచం ఎక్కు..'' కాజల్ ని పిలిచిన నటుడు!

Published : May 10, 2019, 10:56 AM IST
''రా మంచం ఎక్కు..'' కాజల్ ని పిలిచిన నటుడు!

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన తాజా చిత్రం 'సీత'. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన తాజా చిత్రం 'సీత'. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేశారు. 'నా పేరు సీత నేను గీసిందే గీత.. ప్రాస బాగుంది కదా' అంటూ కాజల్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయించింది.

'రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు' అంటూ హీరో విలన్ క్యారెక్టర్ సోనూసూద్ తో చెప్పడం ఆకట్టుకుంటోంది. అమాయకుడైన  హీరో, పొగరున్న హీరోయిన్.. ఆమెని దక్కించుకోవాలని ప్రయత్నించే విలన్.. ఈ ముగ్గురు మధ్య జరిగే కథే ఈ సినిమా.

ట్రైలర్ చివర్లో సోనూసూద్ 'ఎవడికోసమో.. నీ క్యారెక్టర్ మార్చుకోకు సీత.. అది నేనైనా సరే.. ఆ దేవుడైనా సరే.. రా మంచం ఎక్కు' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా మే 24న విడుదల కానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?