
డైరెక్టర్ వెంకీ అట్లూరి చదువును వ్యాపారంగా ఎలా మారుస్తున్నారు అనే కథతో సార్ అంటూ వచ్చాడు. ఈ క్రమంలో సగం వరకే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. సినిమాపై నమ్మకంతో ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు దర్శక నిర్మాతలు. సినిమాలో ఎత్తుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని తీసిన విధానం మాత్రం రొటీన్ గా ఉందన్నారు విశ్లేషకులు. కొన్ని సీన్స్ వరకు మాత్రం వెంకీ అట్లూరి అద్భుతంగా రాసుకున్నాడు. దాంతోపాటు డైలాగులు కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. రొటీన్ స్క్రీన్ ప్లే కూడా ఉండడంతో సార్ అక్కడక్కడ కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్న ఫీలింగ్ వచ్చేసింది . అయితే ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. టాక్ గొప్పగా లేకపోయినా కలెక్షన్స్ బాగున్నాయి. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు తదుపరి సినిమా గురించిన చర్చ మొదలైంది.
అందుతున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ కు ఓ స్టోరీ లైన్ చెప్పి, ఆల్రెడీ ఒప్పించి దానిపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అన్ని కలిసి వస్తే సితారా బ్యానర్ పైనే చేసే అవకాసం ఉదంటున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన `తొలిప్రేమ`తో మంచి హిట్ అవటం తో బిజినెస్ పరంగా కూడా క్రేజ్ వస్తుంది.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ...సితార నాకు హోమ్ బ్యానర్ లాంటిది. నిర్మాత వంశీ గారు నాకు చాలా మంచి స్నేహితుడు. త్రివిక్రమ్ గారంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. వారితో కలిసి పని చేయడం నాకెప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది. అయితే తదుపరి సినిమా గురించి ఇప్పుడే చెప్పలేదు. నేను సార్ అనే ఒక మంచి సినిమా తీశాను. అది ఎక్కువ మందికి చేరువ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను అన్నారు.
సాలిడ్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తర్వాత `మిస్టర్ మజ్ను`, `రంగ్ దే` చిత్రాలతో మెప్పించలేకపోయాడు. అయితే ఈ సారి ఆయన ఓ సందేశాత్మక చిత్రంతో మన ముందుకు వచ్చాడు. అందుకు తోడుగా తమిళ హీరో ధనుష్ ని తెచ్చుకున్నాడు. పెద్ద బ్యానర్...నేటి విద్యా వ్యవస్ద పై సినిమా కావటం, ప్రీ పెయిడ్ ప్రీమియర్ షోలు సినిమాకు హైప్ క్రియేట్ చేసాయి. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ఈ సినిమాకి ఇటు తెలుగులోనూ, అటు తమిళ్ లోనూ సోసో గా ఉందంటూ రివ్యూస్ వచ్చాయి. టాక్ కూడా గొప్పగా లేదు. అయితే, తెలుగునాట ఓపెనింగ్ మాత్రం టాక్ కి మించి కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ అంటోంది.