ఆ పిలుపు ఇక వినిపించదంటూ లోకేష్ ఎమోషనల్.. తారకరత్న మరణంపై చంద్రబాబు, విజయసాయిరెడ్డి సంతాపం

Siva Kodati |  
Published : Feb 18, 2023, 11:32 PM IST
ఆ పిలుపు ఇక వినిపించదంటూ లోకేష్ ఎమోషనల్.. తారకరత్న మరణంపై చంద్రబాబు, విజయసాయిరెడ్డి సంతాపం

సారాంశం

సినీనటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అటు అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తారకరత్న కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

సినీనటుడు నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కోలుకుని తిరిగొస్తారని ఆశించిన కోట్లాది మంది అభిమానులు తారకరత్న మరణంతో  కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు తారకరత్న మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు తారకరత్న కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

చంద్రబాబు నాయుడు :

నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

 

 

నారా లోకేష్ :

బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

 

 

పవన్ కల్యాణ్ :

నటుడు ‘‘ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం.  తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి మోహనకృష్ణ, బాబాయి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. 

 

 

విజయసాయిరెడ్డి :

సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్