Singer Sunitha Farming: కూరగాయలు కోస్తూ సింగర్‌సునీత.. పాటంత మధురంగా ఉందట.. వీడియో వైరల్‌

Published : Jan 12, 2022, 05:31 PM IST
Singer Sunitha Farming: కూరగాయలు కోస్తూ సింగర్‌సునీత.. పాటంత మధురంగా ఉందట.. వీడియో వైరల్‌

సారాంశం

ఇటీవల తన అరటితోటలో అరట గెల కోస్తున్న వీడియోని పంచుకోగా అది వైరల్‌ అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాజాగా కూరగాయలు కోస్తూ కనిపించారు సునీత.

సింగర్‌ సునీత(Singer Sunitha) రెండో మ్యారేజ్‌ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు సింగర్‌గా తన కెరీర్‌ని, ఇంకోవైపు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. రెండో భర్త రామ్‌ వీరపనేని అందించిన సపోర్ట్ తో దూసుకుపోతుంది సింగర్‌ సునీత. ఈ నేపథ్యంలో ఇటీవల వరుస బిజీ షెడ్యూల్‌ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఉల్లాసవంతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయం పనులపై ఫోకస్‌ పెట్టారు సునీత. 

ఇటీవల Sunitha తన అరటితోటలో అరట గెల కోస్తున్న వీడియోని పంచుకోగా అది వైరల్‌ అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. `చక్కరకేళీ ఎంత తీయగా ఉంటుందో తెలుసా.. మీ గొంతు నుంచి వెలువడే పాటంత. మీ ఆనందం ఇలాగే కలకాలం ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలంటూ పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాదు మిమ్మల్ని ఇలా చూడటం ఎంతో హ్యాపీగా ఉందని, ఫార్మింగ్‌లో ఉన్న మాధుర్యం వేరే అని ఇలా రకరకాల కామెంట్లతో సునీతని అభినందిస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికీ వైరల్‌ అవుతుంది. 

మరోవైపు తాజాగా కూరగాయలు కోస్తూ కనిపించారు సునీత. వంకాయలు, ఆకుకూరలు కోస్తూ ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతుంది. సునీత వ్యవసాయం పనులు చేస్తుంటే పాటంత మాధుర్యంగా ఉందంటున్నారు. పాటలు, ఫ్యామిలీనే కాదు, సునీతకి వ్యవసాయం అంటే ఇష్టమనే విషయాన్ని తెలియజేస్తుంది. గార్డెనింగ్‌, ఫార్మింగ్‌పై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధని ఇలా తన వీడియోల రూపంలో పంచుకుంటూ తెలియజేస్తుంది. అభిమానుల మనసులను దోచుకుంటుంది. `నాకు ఇలా పొలంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం.. ఫ్రెష్ కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టం` అని సునీత చెప్పారు.  పాటలు పాడుతూ కనిపించే సునీత తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సింగర్‌ సునీత గతేడాది డిజిటల్‌ రంగంలో ప్రముఖంగా రాణిస్తున్న రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయంతెలిసిందే. హైదరాబాద్‌ సమీపంలోని ఓ పురాతన టెంపుల్‌లో సునీత వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. అనేక మంది సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆమె రెండో పెళ్లిని ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరో లైఫ్‌ని స్టార్ట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సపోర్ట్ గా నిలిచారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి