విజయ్‌ని కాదు, త్రిష ఉదయనిధిని ప్రేమిస్తోంది, రమ్యకృష్ణ అంటే ఆమెకిష్టం.. సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు

Published : Mar 02, 2026, 12:52 PM IST
trisha, singer suchitra

సారాంశం

విజయ్‌కి త్రిష మీద ప్రేమ ఉండొచ్చు, కానీ త్రిష ప్రేమించేది ఉదయనిధి స్టాలిన్‌నే! అసలు వరుణ్ మణియన్‌తో త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణం కూడా ఉదయనిధేనని సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష

దక్షిణ భారత సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష కృష్ణన్. 42 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ అందంలో, నటనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం త్రిష (Trisha Krishnan) చేతిలో వరుసగా పెద్ద సినిమాలున్నాయి. తెలుగులో చిరంజీవితో `విశ్వంభర` సూర్యతో 'కరుప్పు' అనే సినిమాలోనూ నటిస్తోంది. అయితే, ఓవైపు కెరీర్ పరంగా ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నా, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

స్టార్ హీరోలతో సక్సెస్‌ఫుల్ జర్నీ:

త్రిష రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్య, ధనుష్ వంటి అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆమె కేవలం తమిళానికే పరిమితం కాలేదు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన మెరిసింది. `వర్షం`,  `అతడు`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `స్టాలిన్‌`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `తీన్‌ మార్‌` వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.  కెరీర్‌లో ఇంతటి విజయం సాధించిన త్రిష, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది.

పెళ్లి, బ్రేకప్‌ల పర్సనల్ లైఫ్:

త్రిష పెళ్లి విషయం ఎప్పుడూ చర్చనీయాంశమే. మొదట్లో తెలుగు నటుడు రానా దగ్గుబాటితో త్రిష డేటింగ్‌లో ఉందని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ, కుటుంబ కారణాల వల్ల ఆ బంధం ముగిసిపోయిందని అంటారు. ఆ తర్వాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా, పెళ్లి పీటల వరకు వెళ్లేలోపే ఆ బంధం కూడా ముగిసిపోయింది. అప్పటి నుంచి త్రిష పెళ్లి ఊసే ఎత్తలేదు.

సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు

ఈ నేపథ్యంలో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సింగర్ సుచిత్ర, ఇటీవల 'సినీ బజ్' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష గురించి సంచలన ఆరోపణలు చేశారు. సుచిత్ర మాట్లాడుతూ, "విజయ్‌కి త్రిష మీద విపరీతమైన ప్రేమ ఉండొచ్చు, కానీ త్రిష ప్రేమించేది ఉదయనిధి స్టాలిన్‌ని! నిజానికి త్రిష, వరుణ్ మణియన్‌ల పెళ్లి ఆగిపోవడానికి కారణమే ఉదయనిధి స్టాలిన్. వాళ్లిద్దరి పెళ్లి జరగడం ఉదయనిధికి ఇష్టం లేదు` అంటూ కొత్త బాంబు పేల్చారు.

సుచిత్ర ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. ఆమె ఇంకా మాట్లాడుతూ, "నటి త్రిష ఒక బైసెక్సువల్. ఆమెకు మగవాళ్లలో ఉదయనిధి స్టాలిన్ అంటే, ఆడవాళ్లలో నటి రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. ఇక ధనుష్ పేరును త్రిష కేవలం తన స్వార్థం కోసం వాడుకుంటోంది. నా అభిప్రాయం ప్రకారం త్రిష ఎవరినీ పెళ్లి చేసుకోదు. ఆమె ఈ బంధాలకు అతీతమైన ప్రేమను కోరుకుంటుంది` అని సుచిత్ర ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఆమె కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. 

మౌనం వీడని త్రిష:

ఇప్పటికే విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల విషయంలోనూ త్రిష పేరు వినిపిస్తోంది. ఇన్ని ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చుట్టుముడుతున్నా త్రిష మాత్రం దేనికీ స్పందించకుండా తన సినిమాలతో బిజీగా ఉంది. గతంలో తన గురించి తప్పుగా మాట్లాడిన రాజకీయ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న త్రిష, ఇప్పుడు సుచిత్ర వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, సౌత్ సినిమా ఇండస్ట్రీలోని ఈ అందాల తార జీవితం ప్రస్తుతం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rashmika Vijay Reception: రిసెప్షన్ కి కూడా ఆంక్షలు పెట్టిన విజయ్-రష్మిక, కండిషన్స్ ఏంటో తెలుసా?
MSG 50 Days Collections: చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌ గారు 50 రోజులు పూర్తి.. ఇప్పటికీ బాక్సాఫీసు షేకింగ్‌