Mohanlal: బస్సు జర్నీని గుర్తు చేసుకున్న మోహన్‌ లాల్‌.. అదే తన జీవితాన్ని మార్చేసిందంటూ ఎమోషనల్‌

Published : Feb 27, 2026, 04:43 PM IST
mohanlal

సారాంశం

Mohanlal: మోహన్‌ లాల్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయన మలయాళంలో సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. అయినా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు.

కేరళా ఆర్టీసీ కోసం మోహన్‌లాల్‌ యాడ్‌

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కోసం తీసిన ఓ కొత్త యాడ్ ఫిల్మ్‌లో నటించారు. నిమిషంన్నర నిడివి ఉన్న ఈ యాడ్‌ను మోహన్‌లాల్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా విడుదల చేశారు. ఈ యాడ్ ఫిల్మ్‌కు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా, తొడుపుళలో షూటింగ్ జరుపుకుంది.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మోహన్‌లాల్‌

కేరళలో KSRTC బస్సులను ప్రజలు 'ఆనవండి' అని ప్రేమగా పిలుచుకుంటారు. అంటే ఏనుగు బండి అని అర్థం. తన మొదటి సినిమా 'మంజిల్ విరింజ పూక్కళ్' ఆడిషన్ కోసం తిరువనంతపురం నుంచి అలప్పుళకు 'ఆనవండి'లో ప్రయాణించిన రోజులను మోహన్‌లాల్ ఈ యాడ్‌లో గుర్తుచేసుకున్నారు.

తన బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మోహన్‌ లాల్‌ ఎమోషనల్‌

ఈ యాడ్‌లో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ''ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు, తోటి ప్రయాణికుల కదలికలను, వారి హావభావాలను గమనించడం నాకు అలవాటు. బహుశా నా నటనకు అవే మొదటి పాఠాలు అయ్యుంటాయి. అలప్పుళలో బస్సు దిగి నవోదయ స్టూడియోస్‌కు నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ బస్సు, అందులోని ప్రయాణికులు నన్ను ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. యాక్టింగ్ టెస్ట్ అయిపోయాక, మళ్లీ అదే 'ఆనవండి' ఎక్కి తిరిగొచ్చాను. కానీ, వెళ్లిన నేను వేరు, తిరిగొచ్చిన నేను వేరు. నా జీవితంలోకి అదృష్టాన్ని తీసుకొచ్చిన ఆ బస్సుకు నా ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో శుభ సందర్భాలను మలయాళీలకు అందించేందుకు KSRTC ఎప్పుడూ వాళ్లతోనే ఉండాలి'' అని చెప్పుకొచ్చారు. కేరళా ఆర్టీసీని ప్రమోట్‌ చేస్తూ ఆయన చేసిన ఈ యాడ్‌ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. వైరల్‌గా మారింది. ఒక పెద్ద సూపర్‌ స్టార్‌, ఇలా ప్రభుత్వ సంస్థ బాగు కోసం యాడ్‌ చేయడం విశేషమనే చెప్పాలి. దీంతో ఇప్పుడు మోహన్‌ లాల్‌ అందరి హృదయాలను దోచుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
Asha Bhosle: లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స, ప్రస్తుత పరిస్థితి ఇదే