సింగర్ భార్య ఆత్మహత్య... కారణం ఏమిటంటే!

Published : May 14, 2021, 07:39 AM IST
సింగర్ భార్య ఆత్మహత్య... కారణం ఏమిటంటే!

సారాంశం

వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ అయిన సుబ్రమణి భార్య జ్యోతి మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మనస్థాపంతో జ్యోతి ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు అంటున్నారు.


కన్నడ సింగర్ సుబ్రమణి భార్య ఆత్మహత్య చేసుకొని మరణించడం కలకలం రేపింది. వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ అయిన సుబ్రమణి భార్య జ్యోతి మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మనస్థాపంతో జ్యోతి ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు అంటున్నారు. 


భర్తపై కోపంతో పుట్టింటికి వెళ్లిన జ్యోతి అక్కడ ఫ్యాన్ కి ఉరివేసుకున్నారు. ఉరికి వేలాడుతున్న జ్యోతిని కుటుంబ సభ్యులు గమనించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జ్యోతిని మరొక హాస్పిటల్ కి తీసుకెళ్లగా, కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆమెకు బెడ్ లభించలేదు. దీనితో జ్యోతి చివరకు ప్రాణాలు విడిచినట్లు సమాచారం. 


ఆర్కేపుర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్రమణి, జ్యోతిలకు 14ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కోవిడ్ సోకిందన్న భయంతోనే జ్యోతి ఆత్మహత్య చేసుకుందని సుబ్రమణి అంటున్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని అతని ఆరోపణ. సూసైడ్ నోట్ లాంటిది లభించకపోవడంతో పాటు, జ్యోతి పేరెంట్స్ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకపోవడంతో ఆత్మహత్యగా దీనిని నమోదు చేశారు. సరిగమప షో ద్వారా సుబ్రమణి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. డిపార్ట్మెంట్ లో సుబ్రమణి అని అందరూ సింగర్ సుబ్రమణి అని పిలుస్తూ ఉంటారు. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?