వారికే ఓటేయండి.. సింగర్ స్మిత స్పెషల్ సాంగ్!

Published : Apr 09, 2019, 04:14 PM IST
వారికే ఓటేయండి.. సింగర్ స్మిత స్పెషల్ సాంగ్!

సారాంశం

ప్రముఖ సింగర్ స్మిత ఎన్నిక నేపధ్యంలో ఓటర్లను ఉద్దేశిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ప్రముఖ సింగర్ స్మిత ఎన్నిక నేపధ్యంలో ఓటర్లను ఉద్దేశిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'నా పేరు ఆంధ్రా.. నా వయసుఐదేళ్లు' అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోలో స్మితా కూతురు శివి నటించింది.

ఈ పాటలో ఏ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా.. తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వీడియో ద్వారా చెప్పింది. అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు.

ఈ వీడియో స్మిత ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా తీసినట్లు కనిపిస్తున్నా.. అనుబహవం ఉన్న నాయకత్వం ఉంటేనే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని పరోక్ష సందేశం వినిపిస్తోంది. గతంలో స్మిత 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీకి మద్దతుగా ఓ ఆల్బం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 28: అమూల్యను అర్థరాత్రి ఎత్తుకెళ్లి నిజస్వరూపం చూపించిన విశ్వక్
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి నడుము విరగ్గొట్టిన మీనా, మనోజ్ నోరు మూయించిన శ్రుతి