Sangeetha Sajith Passes Away: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, 200 పాటలకు పైగా పాడిన గాయని మృతి

Published : May 22, 2022, 04:25 PM IST
Sangeetha Sajith Passes Away: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, 200 పాటలకు పైగా పాడిన గాయని మృతి

సారాంశం

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సౌత్ లో వరుసగా సినీ సెలబ్రిటీలు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇక రీసెంట్ గా పరిశ్రమ సీనియర్ గాయనిని కోల్పోయింది. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయని సంగీత సాజిత్ హఠాన్మరణం పొందారు. గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతన్న ఆమె ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారు. సంగీతా సాజిత్ చాలా కాలంగా  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చాలా రోజులుగా ఆమె కేరళలోని తిరువనంతపురంలో ఉన్న తన సోదరి నివాసంలో  చికిత్స పొందుతున్నారు. 

మే 22 ఆదివారం  తెల్లవారు జామున సంగీతా సాజిత్  కన్నుమూశారు. 46 ఏళ్ల సంగీత తన సోదరి వద్ద చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆమె అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం తిరువనంతపురం థైకాడ్‌లోని శాంతికవాదం పబ్లిక్‌ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఇక సంగీత మరణ వార్త తెలుసకున్న సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు  ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రార్థిస్తున్నారు. 

మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో అనేక పాటలు సంగీత సౌత్ లో దాదాపు  200కి పైగా పాటలను పాడారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన 'మిస్టర్‌ రోమియో'లోని తమిళ సాంగ్‌ 'తన్నీరై కథలిక్కుమ్‌'తో మంచి గుర్తింపు పొందారు. రీసెంట్ గా వచ్చిన మలయాళ సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ లో తాళం పోయి తప్పూమ్‌ పోయి సాంగ్‌ తో ఆడియన్స్ ను పలకరించారు సంగీత.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?