Sandhya Mukherjee Passes Away: బెంగాల్ గాన తరంగం సంధ్య ముఖర్జీ ఇకలేరు.

By Mahesh JujjuriFirst Published Feb 15, 2022, 8:48 PM IST
Highlights

ప్రముఖ బెంగాల్ గాయని సంధ్య ముఖర్జీ(Sandhya Mukherjee) ఇక లేదు. 90 ఏళ్ల వయస్సులో.. అనారోగ్య కారణాలతో కోల్ కతాలో ఆమె తుదిశ్వాస విడిచారు. రీసెంట్ గా కూడ సెన్సేషన్ అయ్యారు సంధ్య.

ప్రముఖ బెంగాల్ గాయని సంధ్య ముఖర్జీ(Sandhya Mukherjee) ఇక లేదు. 90 ఏళ్ల వయస్సులో.. అనారోగ్య కారణాలతో కోల్ కతాలో ఆమె తుదిశ్వాస విడిచారు. రీసెంట్ గా కూడ సెన్సేషన్ అయ్యారు సంధ్య.

బెంగాల్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన గానంతో మైమరపింపచేసిన గాన తరంగం సంధ్య ముఖర్జీ(Sandhya Mukherjee)  మరణించారు. ఆనాటి తరం గాయనీమణుల్లో సంధ్య ముఖర్జీ (Sandhya Mukherjee)  స్టార్ గా వెలుగొందారు. బెంగాల్ సంగీత సాంమ్రాంజ్యం నుంచి వచ్చిన బర్మన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు వేల పాటలు పాడారు సంధ్య ముఖర్జీ (Sandhya Mukherjee). ఆమె మరణంతో బెంగాల్ చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ లో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.

రీసెంట్ గా 90 ఏళ్ల వయస్సులో సంధ్య ముఖర్జీ(Sandhya Mukherjee) కి పద్మశ్రీ ప్రకటించింద కేంద్ర ప్రభుత్వం. కాని బెంగాల్ నుంచి పద్మశ్రీతో పాటు ఇతర అవార్డ్ లను చాలామంది తిరస్కరించారు. అందులో సంధ్య ముఖర్జీ (Sandhya Mukherjee)  కూడా ఉన్నారు. ఈ వయస్సులో తనకు పద్మశ్రీ అవసరం లేదు అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ లకు  పద్మశ్రీ తీసుకునే అర్హత ఉందని. తనకు ఆ అవార్డ్ అవసరం లేదని పద్మా అవార్డ్ ను తిరస్కరించి సంచలనం సృష్టించారారమె.  ఈ విషయాన్ని సంధ్యకూతురు ఓ ప్రకటనలో తెలిపారు.  

ఇక చాలా కాలంగా పలు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న లెజండరీ సింగర్.. లాస్ట్ మన్త్ కోవిడ్ బారిన పడ్డారు. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్న సంధ్య ముఖర్జీ (Sandhya Mukherjee)  కోవిడి నుంచి కోలుకున్నారు. కాని అనారోగ్యంతో పోరాడి గెలవలేక పోయారు. ఇక సధ్య ముఖర్జీ మరణంతో అటు బెంగాల్ తో పాటు ఇటు బాలీవుడ్ సీన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

click me!