Tom Holland: భారత్ కి పెద్ద అభిమానిని.. తాజ్ మహల్ సందరిస్తాను- టామ్ హాలండ్

Published : Feb 15, 2022, 08:12 PM IST
Tom Holland: భారత్ కి పెద్ద అభిమానిని.. తాజ్ మహల్ సందరిస్తాను- టామ్ హాలండ్

సారాంశం

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాలండ్ (Tom Holland) భారత్ పై తన ప్రేమ చాటుకున్నారు. ఇండియా అంటే తనకెంతో ఇష్టమన్న ఈ స్పైడర్ మాన్ అతి త్వరలో భారత్ లోని తాజ్ మహల్ సందర్శిస్తాను అన్నారు.

 టామ్ హాలండ్ తన లేటెస్ట్ మూవీ అన్‌ చార్టెడ్ (Uncharted)చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశంపై తన ప్రేమను చాటుకున్నారు. అన్ చార్టెడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టామ్ మాట్లాడుతూ  "నేను భారతదేశానికి పెద్ద అభిమానిని, అయితే భారత్ ని సందర్శించే అవకాశం నాకు ఇంకా దక్కలేదు. నాపై  భారతదేశంలోని  అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు." అన్నారు. 

టామ్ ఇంకా మాట్లాడుతూ "నా కొత్త చిత్రం అన్‌ చార్టెడ్ భారతీయ ప్రేక్షకులను పలకరించనున్నాను. అలాగే భారత ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. నా భారతీయ అభిమానులను కలవడానికి ఏదో ఒక రోజు భారతదేశానికి వస్తాను. అలాగే నీ సినిమా షూట్ భారత్ లో చేయాలనుకుంటున్నాను. భారతదేశంలోని తాజ్ మహల్‌తో సహా, అక్కడ ప్రతిదీ చాలా అందంగా ఉంటుంది. నేను భారతదేశం అంతటా ప్రయాణించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను," అని అతను చెప్పాడు.

అన్ చార్టెడ్ మూవీ ఫిబ్రవరి 18 నుండి థియేటర్స్ లో ప్రదర్శించనుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ,  తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. టామ్ హాలండ్ స్పైడర్ మాన్ నో వే హోమ్ ఇండియాలో భారీ ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి భారీగా వసూళ్లు దక్కాయి. ఇండియాలో కూడా టామ్ హాలండ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే