ప్రముఖ స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌.. ఏం జరిగింది?

Published : Mar 04, 2025, 09:28 PM ISTUpdated : Mar 04, 2025, 10:17 PM IST
ప్రముఖ స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌.. ఏం జరిగింది?

సారాంశం

స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నిజాంపేటలోని తన నివాసంలోనే ఆమె సూసైడ్‌ అటెంప్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రముఖ స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. పోలీసులు ఆమెని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని నిజాం పేటలో నివాసం ఉంటున్న కల్పన  నిద్రమాత్రలు మింగి సూసైడ్‌ అటెంప్ట్ చేసిందని తెలుస్తుంది. ఈ విషయం మంగళవారం బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఆమె స్థానిక హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని సమాచారం. వైద్యులు పర్యవేక్షణలో కల్పన ఉన్నట్టు, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుంది. అయితే స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న కల్పన సడెన్‌గా ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. రెండు రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇది గమనించిన అపార్ట్మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  పోలీసులు వెంటనే కల్పన ఇంటికి వెళ్లి డోర్‌ బద్దలు కొట్టగా బెడ్‌పై ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. బెడ్‌పై పలు టాబ్లెట్లు కనిపిస్తున్నాయి. కల్పనని బయటకు తీసుకొచ్చారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇటీవల కాలంలో బాగా యాక్టివ్‌గా ఉన్న ఆమె ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అందరికి షాకిస్తుంది. ఇదిలా ఉంటే తన భర్తతో నిజాంపేటలో నివాసం ఉంటుంది కల్పన. కానీ ఆ సమయంలో తన భర్త లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అలాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేరు. ఆమె సెల్‌ ఫోన్‌ కూడా కనిపించడం లేదు. తన ఇంట్లో రెండు రోజుల క్రితమే ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. దీనిపై  కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

సింగర్‌ కల్పన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో పాటలు పాడారు. ముఖ్యంగా తెలుగు, తమిళంలో వేల పాటలు ఆలపించారు. టాప్‌ సింగర్స్ లో ఒకరిగా ఉన్నారు. కల్పన బిగ్‌ బాస్‌ తెలుగు మొదటి సీజన్‌లోనూ పాల్గొన్నారు. ఐదేళ్ల నుంచే సింగర్‌గా కెరీర్‌ ని ప్రారంభించింది కల్పన. స్టార్‌ సింగర్‌ సీజన్‌ 5లో ఆమె విన్నర్‌గా నిలిచారు. ఇది మలయాళ ఏషియానెట్‌లో టెలికాస్ట్ అయ్యింది. ప్రస్తుతం సూపర్‌ సింగర్‌ జూనియర్‌కి ఆమె జడ్జ్ గా ఉన్నారు. ఓ వైపు సింగర్‌, మరోవైపు జడ్జ్ గా పలు సింగింగ్‌ షోస్‌ చేస్తూ బిజీగా ఉన్నారు కల్పన. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం
Karthika Deepam 2 Latest Episode: మీకు నాకంటే దీపే ఎక్కువన్న జ్యో-పారు మాటలను తండ్రితో చెప్పిన శౌర్య