రజనీ 'ద‌ర్భార్' ఫ‌స్ట్ లుక్...హాలీవుడ్ కాపీనా ?

By Udaya DFirst Published Apr 13, 2019, 1:39 PM IST
Highlights

ఇంతకు ముందు రోజుల్లో ఏదన్నా  సినిమా కథ కానీ పోస్టర్ కానీ కాపీ కొట్టనా అది కొంతమందికే తెలిసేది. అది అక్కడితో ఆగిపోయేది. 

ఇంతకు ముందు రోజుల్లో ఏదన్నా  సినిమా కథ కానీ పోస్టర్ కానీ కాపీ కొట్టనా అది కొంతమందికే తెలిసేది. అది అక్కడితో ఆగిపోయేది. కానీ రోజులు మారాయి. ప్రతీ ఒక్కరూ ఫేస్ బుక్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకరకి తెలిసిన విషయం అదీ సెలబ్రెటీలకు సంభందించి అయితే వైరల్ అయ్యిపోతోంది. ముఖ్యంగా సినిమాలు..ఏదైనా సినిమా నుంచి కాపీ కొట్టారని తెలిస్తే జనం వాటిని ఆధారాలతో సహా బయిటకు తెచ్చి ఎండగట్టేస్తున్నారు. ప్రస్తుతం   మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ద‌ర్భార్ చిత్రం ఫ‌స్ట్ లుక్ హాలీవుడ్ మూవీ పోస్ట‌ర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. 

గతంలో మురుగ‌దాస్ తెర‌కెక్కించిన గ‌త చిత్రాలు తుపాకి, కత్తి సినిమాల విషయంలో నెటిజ‌న్స్ ఈ రెండు హాలీవుడ్‌కి కాపీ అని అప్ప‌ట్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ద‌ర్భార్ చిత్రం ఫ‌స్ట్ లుక్‌ని హాలీవుడ్‌లో 2017లో వచ్చిన కిల్లింగ్ గంథర్ సినిమా పోస్టర్ నుంచి తీసుకున్నారని  ఆ పోస్టర్ తో సహా ప్రచారం మొదలైంది. ముఖ్యంగా రజనీ యాంటి ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటున్నారు.   కిల్లింగ్ గంథర్ సినిమాలో ఆర్నాల్డ్ ష్వాట్జ్‌నెగ్గర్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు.  

ఇక ఈ విషయమై ఈ పోస్టర్ డిజైనర్ విన్సీ రాజ్  ని మీడియా వారు సంప్రదించారు. ఆయన ఈ ఆరోపణలని ఖండించారు. తాను చాలా నిజాయితీగా ఈ పోస్టర్ డిజైన్ చేసానన్నారు. కాలా, కబాలి తర్వాత రజనీ సార్ తో చేస్తున్నానని ,నేను ఆయనకు వీరాభిమానని అని, ఇలా తనకు ఆఫర్ రావటం అదృష్టం గా భావిస్తాను కానీ ఇలాంటి కాపీ పనులు చేయనని అన్నారు. ఇక అసలు తాను ఆ హాలీవుడ్ పోస్టర్ ని చూడలేదని, కొందరు కావాలనే తనను అప్రదిష్టపాలు చేయటానికి ఇలాంటి కాపీ ఆరోపణలు చేస్తున్నట్లు వాపోయారు.

రీసెంట్ గా  ముంబైలో ఘ‌నంగా ప్రారంభ‌మైన ద‌ర్భార్ చిత్రం ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార చిత్రంలో  హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ స్వ‌రాలు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ఇందులో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

click me!