కమల్ హాసన్ పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు.. కళ్లెదుట జరిగిన సంఘటనని పట్టించుకోలేదు, ఎలా నమ్మాలి

By Asianet NewsFirst Published May 26, 2023, 10:42 AM IST
Highlights

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది.

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు. 

మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి పోరాడుతూనే ఉంది. 

సందర్భం వచ్చిన ప్రతిసారి చిన్మయి వైరముత్తుపై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చిన్మయి.. వైరముత్తు వ్యవహారంలో ఏకంగా కమల్ హాసన్ ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ రెజ్లర్లు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. రెజ్లర్లకు మద్దతుగా కమల్ హాసన్ తాజాగా ట్వీట్ చేశారు. 

నేషనల్ గ్లోరీ కోసం పోరాడాల్సిన రెజ్లర్లు వ్యక్తిగత భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారతీయులారా మన అటెన్షన్ కి ఎవరు అర్హులు ? క్రీడాకారులా లేక నేర చరిత్ర కలిగిన నేతలా అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ సూటిగా ప్రశ్నించింది. 

మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులో మహిళా సింగర్ 5 సంవత్సరాలు నిషేదానికి గురైంది. ఈ సంఘటన వారి కళ్ళముందే జరిగింది. కానీ ఆ రచయితతో ఉన్న పరిచయం కారణంగా ఎవరూ స్పందించరు. తమ చుట్టూ జరిగే సంఘటనలని పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులని ఎలా నమ్మాలి అంటూ చిన్మయి కమల్ హాసన్ ట్వీట్ ని పోస్ట్ చేసింది. చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

click me!