తల్లీ,తండ్రులైన రాహుల్, చిన్మయి దంపతులు, కవలపిల్లలకు జన్మనిచ్చిన గాయని

Published : Jun 22, 2022, 10:08 AM ISTUpdated : Jun 22, 2022, 10:09 AM IST
తల్లీ,తండ్రులైన రాహుల్, చిన్మయి దంపతులు, కవలపిల్లలకు జన్మనిచ్చిన గాయని

సారాంశం

గాయని చిన్మయి,నటుడు రాహుల్ దంపతులు తల్లి తండ్రులుగా ప్రమోషన్ సాధించారు. పెళ్లైన 8 ఏళ్లకు కవల పిల్లలకు జన్మనిచ్చింది స్టార్ సింగర్.   

నటుడు, దర్శకుడు రాహుల్ రవింద్రన్ , సింగర్ చిన్మయి ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి.. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గత రాత్రి కవలల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చిన్నారుల చేతులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. 

విషయం తెలిసిన నెటిజన్లు, సెలబ్రిటీలు చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్నారు.

 

 

స్టార్ హీరోయిన్ సమంత సక్సెస్ లో.. చిన్మయి పాత్ర చాలా ఉంది. సమంతకు దాదాపు అన్ని సినిమాలకు   డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు. బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏమాయ చేశావె, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరి వాడేలే నుంచి ఇటీవల విడుదలైన మేజర్ వరకు ఎన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడారు. 

ఇక ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ఎన్నో మంచి  సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు. శ్యామ్‌సింగరాయ్ సినిమాలో ఆయన పోషించిన రాహుల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అంతే కాదు సుశాంత్  హీరోగా చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. కాని ఆతరువాత నాగార్జునతో మన్మథుడు2 చేసి భారీ డిజాస్టర్ అందుకున్నాడు రాహుల్. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో