
జూన్ 21న దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. సెలబ్రేటీలు సైతం యోగా విశిష్టతలు తెలుపుతూ.. అభిమానులకు సూచనలిచ్చారు. అంతేకాకుండా యోగాకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ క్రమంలోనే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రం దర్శకుడు ఓం రౌత్ సైతం యోగాశనాలు వేస్తూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫొటోను చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ఫొటోను అడ్డం పెట్టి ఆ దర్శకుడుని ఆడేసుకుంటున్నారు. అందుకు కారణం ఏమిటంటే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ డ్రామా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుండగా, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా, సినిమాకు సంభందించిన స్పెషల్ అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటిదాకా ఓ ఫస్ట్ లుక్ కానీ, ఓ ట్రైలర్, టీజర్ వంటివి ఏమీ బయిటకు రాలేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు మండిపోతోంది.
ఐదు వందల కోట్ల బడ్జెట్ తో దేశంలో అతి పెద్ద స్టార్ అయిన ప్రభాస్ తో ఫిల్మ్ చేస్తున్నావు. ఆ సినిమాకు సంభందించిన అప్ డేట్స్ ఇవ్వటానికి నీకు సమయం లేదు. కానీ ఇంటర్నేషనల్ యోగా డే రోజున మాత్రం నీ ఫొటోను షేర్ చేసావు..నువ్వు ఫుట్ బాల్ లాగ ఉన్నావు..ఏంటిరా మాకు ఈ టార్చర్..ఎప్పుడు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తావు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజిలో డైరక్టర్ ని ఆడుకుంటున్నారు.
"ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకి సిద్ధమవుతున్నట్లుగా చిత్రబృందం ఆ మద్యన ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ నటించిన "రాధేశ్యామ్" రిలీజై ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ప్రభావం నుంచి ప్రభాస్ బయిటపడి "సలార్" సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు "ఆది పురుష్" కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. అంటే 2023 లో ప్రభాస్ 2 సినిమాలు విడుదల చేయబోతున్నారు. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన "ఆది పురుష్" సినిమాకి సాచెత్-పరంపర సంగీతాన్ని అందించారు.