హాంకాంగ్ సింగర్ కోకోలీ ఆత్మహత్య, హాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Published : Jul 06, 2023, 02:56 PM IST
హాంకాంగ్ సింగర్ కోకోలీ ఆత్మహత్య, హాలీవుడ్ ప్రముఖుల సంతాపం

సారాంశం

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో మరణాలు ఎక్కువయ్యాయి. అందులోను ఆత్మహత్యలు మరీ  ఎక్కువయ్యాయి. మన దగ్గర కాదు కాని.. హాలీవుడ్ లో ఎక్కువమంది తారలు వరుసగా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.   


హాలీవుడ్ లో బలవన్మరణాలు సంఖ్య పెరుగుతోంది. ఆమధ్య అమెరికాకు చెందిన సింగర్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించగా.. తాజాగా హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 48 ఏళ్లు కాగా..  ఈ విషయాన్ని లీ సోదరిలు  కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. అయితే  లీ ఆత్మహత్యకు గల కారణాలను ఆమె ఫ్యాన్స్ కనుగొనే ప్రయత్నం చేస్తుండగా.. ఆమె గత కొన్నాళ్లుగా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 

కొంత కాలంగా డ్రిప్రెషన్ లో ఉన్న లీ పరిస్థితి రీసెంట్ గా  మరింత దిగజారినట్టు ఆమె సిస్టర్స్ పేర్కొన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 2న లీ ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించడంతో.. అపస్మారకస్థితిలో ఆమెను గుర్తించిన ఫ్యామిలీ వెంటనే  ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కోమాలోకి చేరుకుంది. 

దాదాపు మూడు రోజులు కోమాలో.. చావుతో పోరాటం చేసిన లీ..చివరికి 5న ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన హాంకాంగ్ సంగీత ప్రియులు తట్టుకోలేకపోతున్నారు. హాంకాంగ్‌లో జన్మించిన లీ శాన్‌ఫ్రాన్సిస్కోలో పెరిగింది. ఆ తర్వాత పాప్ సింగర్‌గా కెరియర్‌ను ప్రారంభించింది. తన 30 ఏళ్ల కెరియర్‌లో పాప్ సింగర్ గా వందల ఆల్బమ్స్‌ రిలీజ్  చేసింది. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఘనత అందుకున్న తొలి చైనీస్ అమెరికన్‌గా రికార్డుకెక్కింది. 1998లో ఆమె విడుదల చేసిన మాండరిన్ ఆల్బం డి డా డి సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ దాదాపు  మూడు నెలల్లోనే 10 లక్షలకు పైగా కాపీలు అమ్ముడు పోయాయి. 

అంతే కాదు ఆమె కెరీర్ లో ఎన్న మైలు రాళ్లు.. ఎన్నెన్నో అవార్డ్ లు అందుకున్నారు. కోట్ల మంది అభిమానులను సోంతం చేసుకున్నారు లీ.  మరీ ముఖ్యంగా ఆమె చేసిన..  హిడెన్‌ డ్రాగన్‌ లోని ‘ఎ లవ్‌ బిఫోర్‌ టైమ్‌’ సాంగ్‌ 2001లో  ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామిట్‌ కూడా అయింది. అంతే  కాదు ఆ అవార్డ్ వేడుకల్లో ఆమె ప్రదర్శన కూడా అందరిని ఆకట్టుకుంది. ఆ ప్రదర్శనతో.. మొదటిసారి ఆస్కార్ లో పెర్ఫామ్ చేసిన  తొలి చైనీస్ అమెరికన్ గానూ ఆమె రికార్డులకెక్కింది. ఆమె మరణంతో సంగీత ప్రపంచ మూగబోయింది. మౌన గానంతో ఆమెకు నివాళి అర్పిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?