'భారతీయుడు' కి మనవడిగా స్టార్ హీరో

Published : Jan 12, 2019, 06:11 PM IST
'భారతీయుడు' కి మనవడిగా స్టార్ హీరో

సారాంశం

యూనివర్శిల్ హీరో కమల్‌ హాసన్‌,ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్  భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

యూనివర్శిల్ హీరో కమల్‌ హాసన్‌,ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్  భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్ సరసన హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది.

రెండో సారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ క్రేజ్ ని మరింత పెంచటానికి ఈ సినిమాలోకి ఓ స్టార్ హీరోని తీసుకు వచ్చారు. అతనే శింబు. 

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శింబు .. కమల్ మనవడి పాత్రలో కనిపించనున్నాడనేది సమాచారం. 'భారతీయుడు'లో కమల్ 'సేనాపతి' అనే ముసలివాడుగా .. ఆయన కొడుకు 'చంద్రబోస్'గా ద్విపాత్రాభినయం చేస్తూ కనిపించారు. 

ఇప్పుడు ఈ సినిమాలో 'సేనాపతి' మనవడిగా .. 'చంద్రబోస్' కొడుకుగా శింబు కనిపిస్తాడని చెబుతున్నారు. చాలా విభిన్నం గా శింబు పాత్రను శంకర్ మలిచాడని టాక్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం 8 దేశాల్లోని లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగును జరుపుకోబోతోంది.  మరో ప్రక్క ఇప్పటికే  ‘సేనాపతి ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ఓ ప్రీలుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.  

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది