
తమిళ నాట స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన శింబు.. తను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇండస్ట్రీకి చాలా కాలం దూరం అయ్యాడు. ఇక రీసెంట్ గా శింబు మానాడు సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ సక్సెస్ సాధించింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈమూవీ కోట్లు కొల్లగొట్టింది. అయితే ఆతరువాత శింబు అదే జోష్‌ను శింబు కొనసాగించలేకపోయారు. తర్వాత చేసిన రెండు సినిమాలు ఆయనకు నిరాశను మిగిల్చాయి. ది లైఫ్ ఆఫ్ ముత్తు, పత్తు తాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ గా నిలిచాయి. కాగా ఫలితం ఎలా ఉన్న శింబు మాత్రం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.
ఈసారి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు శింబు. ప్రస్తుతం ఆయన కన్నులు కన్నులు దోచాయంటే ఫేమ్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ ఎక్కబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. ఈసినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు శింబు. హిట్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసినిమాలో శింబు జోడీగా బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని చూస్తున్నారు మేకర్స్.
ఈ సినిమాలో శింబుకు జోడీగా దీపికా పదుకొణెను తీసుకోవాలని టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పొజీషన్‌లో ఉన్న దీపికా.. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తుంది. ఈ టైమ్ లో ఆమె శింబుతో కలిసి నటించడానికి ఓకే చెబుతుందా అనేది ప్రశ్నగానే ఉంది. మరో వైపు ఈసినిమాకు నిర్మాత కమల్ హాసన్ కాగా.. ఆయన అడిగితే కాదనదన్న నమ్మకంతో ఉన్నవారు మేకర్స్.
కాని ఈ సినిమాకు దీపికా రెమ్యూనరేషన్ పెద్ద సమస్య అవ్వచ్చు..ఆమె కావాలంటే.. శింబుకంటే ఎక్కువగా దీపికాకు సమర్పించుకోవాలి. మరి దానికి మేకర్స్ రెడీగా ఉన్నారా.. ? అసలు దీపికా ఏమంటుంది. వీరి కాంబోలో సినిమా వస్తే.. ఎలా ఉంటుంది. ఇది జరిగే పనేనా అనేది చూడాలి. ఇక దీపికా తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన కొచ్చాడియాన్ సినిమాతో తొలిసారిగా తమిళ సినిమా చేసింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కేలో నటిస్తోంది.