
నేడు మదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ చిరంజీవి బెస్ట్ విషెస్ తెలియజేశారు. తల్లి అంజనా దేవి, భార్య సురేఖలతో పాటు ఇద్దరు చెల్లెళ్లతో ఫోటోలు దిగారు. మహిళల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. చిరంజీవి పోస్ట్ మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, అభిమానం తెలియజేసేదిగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి తల్లి అంజనా దేవిని అమితంగా ప్రేమిస్తారు. ఖాళీ సమయాల్లో తల్లితో గడపడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. ఆమెకు ఇష్టమైన వంటకాలు స్వయంగా చేసి వడ్డిస్తారు.
చిరంజీవి మదర్స్ డే పోస్ట్ వైరల్ గా మారింది. నాగబాబు కూడా మదర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఫోటోలకు పోజులిచ్చారు. మరోవైపు చిరంజీవి మంచి జోరు మీదున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వాల్తేరు వీరయ్య విజయం ఆయనలో జోష్ నింపించింది.
ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ తో భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. ఇది తమిళ చిత్రం వేదాళం రీమేక్ గా తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి లుక్ ఆసక్తి రేపుతుంది. వింటేజ్ చిరును గుర్తు చేస్తుంది. భోళా శంకర్ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచేస్తుంది.
త్వరలో చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించనున్నారు. యంగ్ డైరెక్టర్స్ కి ఆయన అవకాశాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో చిరంజీవి నుండి మూడు చిత్రాలు విడుదలయ్యాయి. దసరా కానుకగా భోళా శంకర్ విడుదల కానుంది.