అలియా భట్ తో బ్రేకప్ కి కారణమదే..!

Published : Feb 04, 2019, 02:11 PM IST
అలియా భట్ తో బ్రేకప్ కి కారణమదే..!

సారాంశం

కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకి తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తన ప్రేమ, బ్రేకప్ సంగతులు చెప్పుకొచ్చాడు. 

కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకి తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తన ప్రేమ, బ్రేకప్ సంగతులు చెప్పుకొచ్చాడు. గతంలో స్టార్ హీరోయిన్ అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాలు ప్రేమించుకున్నారు. 

కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. అయితే ఈ విషయాలను ఎప్పుడూ పబ్లిక్ గా చెప్పలేదు. కానీ కొన్నాళ్లకు ఈ జంట విడిపోయింది. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే విషయంపై స్పందించిన సిద్ధార్థ్.. వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాల వలనే బ్రేకప్ అయిందని వెల్లడించాడు. బ్రేకప్ అయినప్పటి నుండి ఇద్దరం మళ్లీ కలుసుకోలేదని, అలా అని తమ మధ్య ఎలాంటి కోపాలు లేవని, మంచి రిలేషనే ఉందని అన్నాడు. 

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో ఇద్దరూ కలిసి నటించామని, నటుడిగా తన తొలి సన్నివేశం అలియాతోనే చిత్రీకరించారని ఆ మెమొరీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. అలియా భట్ తన ప్రొఫెషనల్ లైఫ్ ని మరోస్థాయికి తీసుకెళ్లాలని భావించడంతో తన రిలేషన్ ని కొనసాగించలేకపోయామని స్పష్టం చేశారు.

తమ మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటని వెల్లడించారు. విడిపోయే విషయంలో ఎవరి తప్పూ లేదని తెలిపాడు. కానీ బ్రేకప్ తనను ఎంతగానో బాధించిందని, చాలా ఎమోషనల్ అయినట్లు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా