
కోట్లు ఖర్చుపెట్టి, కష్టపడి రూపొందించిన సినిమాని థియేటర్ లో కాకుండా ఓటిటి రిలీజ్ అంటే చాలా మందికి ఇష్టపడరు. కానీ మార్కెట్ లెక్కలు వేరేగా ఉంటాయి. డైరక్ట్ రిలీజ్ కు మంచి పేమెంట్ వస్తున్నప్పుడు, థియేటర్ పై నమ్మకం లేనప్పుడు ఓటిటీనే శరణ్యం. అలా రష్మిక చిత్రం ఒకటి ఇప్పుడు డైరక్ట్ ఓటిటికి రెడీ అవుతోంది.
నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) రీసెంట్ గా హిందీలోనూ తెరంగ్రేటం చేసింది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. భాషతో సంబంధం లేకుండా ఆమె అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంది. తాజాగా బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘గుడ్ బై’ (Good Bye) చిత్రంలో నటించింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రం ఈ మధ్యనే విడుదలైనప్పటికి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. రష్మిక మరో బాలీవుడ్ సినిమాను గతంలోనే పూర్తి చేసింది. ఈ మూవీ నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది.
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందిన మిషన్ మజ్నుని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. 2023 జనవరి ప్రీమియర్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. నిజానికిదే తన బాలీవుడ్ డెబ్యూ. నిర్మాణం ఆలస్యం కావడంతో దీనికన్నా ముందు అమితాబ్ బచ్చన్ కూతురిగా నటించిన గుడ్ బై విడుదలయ్యింది. అది వర్కవుట్ కాకపోవటమే ఈ డెసిషన్ తీసుకోవటానికి కారణం అంటున్నారు. శంతను భాగ్ఛీ దర్శకత్వంలో రూపొందిన ఈ మిషన్ మజ్ను ఒక స్పై థ్రిల్లర్.
అయితే ఇలా మిషన్ మజ్ను సినిమా విషయమై నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం నార్త్ ఆడియన్స్ లో రెగ్యులర్ కంటెంట్ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకతే అంటున్నారు. ఈ సినిమాని థియేటర్ లో రిసీవ్ చేసుకుంటారో లేదోననే అనుమానంతో పాటు నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన టెంప్టింగ్ ఆఫర్ కి టెమ్ట్ అయ్యి నిర్మాతలు ఎస్ చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ దీని డబ్బింగ్ వెర్షన్ ని స్ట్రీమింగ్ చేస్తారు.