సూపర్ స్టార్ కృష్ణ మృతి గురించి బిగ్ బాస్ హౌస్ లో ప్రకటన.. కొత్త కెప్టెన్ గా రేవంత్, పోరాడి ఓడిన ఇనయ

By team teluguFirst Published Nov 17, 2022, 11:21 PM IST
Highlights

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక షాకింగ్ న్యూస్ తో నేటి ఎపిసోడ్ ప్రారంభం అయింది.

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక షాకింగ్ న్యూస్ తో నేటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించిన విషయాన్ని బిగ్ బాస్ బరువైన మనసుతో ఇంటి సభ్యులకు తెలియజేశారు. దీనితో బిగ్ బాస్ సభ్యులంతా షాక్ కి గురవుతూ విషాదంలో మునిగిపోయారు. 

ఆ తర్వాత కృష్ణ గారికి నివాళి అర్పిస్తూ కాసేపు మౌనం పాటించారు. అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఐదుగురు పోటీదారులు ఐదు గోల్ పోస్ట్స్ ఉంటాయి. మధ్యలో ఒక బాల్ ఉంటుంది. చేతులతో కూడా గోల్ వేయచ్చు. 

ప్రతి ఒక్కరూ ఇతరుల గోల్ పోస్ట్స్ లో గోల్ వేసే ప్రయత్నం చేయాలి. ఎవరి గోల్ పోస్ట్ నుంచి గోల్ వెళుతుందో వారు పోటీ నుంచి తప్పుకుంటారు. ఈ పోటీలో రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహన్ అబ్బాయిలు పాల్గొనగా.. ఇనయ మాత్రమే లేడీగా పాల్గొంటుంది. 

ముందుగా రోహిత్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి, ఇనయ వరుసగా పోటీ నుంచి తప్పుకుంటారు. చివరకి పోటీలో రేవంత్, శ్రీహన్ మాత్రమే ఉంటారు. రేవంత్ తన బలం మొత్తం ప్రయోగించి శ్రీహన్ ని నెట్టివేస్తూ గోల్ వేస్తాడు. దీనితో శ్రీహన్ అవుట్ అయి రేవంత్ విజేతగా నిలుస్తాడు. 

బిగ్ బాస్ రేవంత్ ని ఇంటికి కొత్త కెప్టెన్ గా ప్రకటించి అభినందిస్తారు. గేమ్ చాలా మజా ఇస్తోంది అంటూ బయట ఉన్న రాజ్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. ముందుగా ఈ గేమ్ కి ఫైమా సంచాలక్ గా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత అవుట్ అయిన సభ్యులు సంచాలక్ పాత్ర నిర్వహిస్తారు. 

click me!