
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనైనా.. రాజకీయాలల్లోనైనా పవన్ వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ వ్యక్తిత్వం ఏమిటో..ఆయనేంటో మరోసారి బయటకు వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర” లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. ఇక దీంతో పోలీసులు ఎంత బందోబస్త్ పెట్టిన వారిని ఆపడం కష్టతరం అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ పోలీసుల బందోబస్త్ మధ్య వెళ్తుండగా జనసందోహం ఎక్కువ కావడంతో ఒక పోలీస్ అదుపుతప్పి పడిపోయాడు.
దీంతో వెంటనే పవన్ స్పందించి అంతమందిని దాటుకొని పోలీసును లేపి.. జాగ్రత్త చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై పవన్ అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అది పవన్ వ్యక్తిత్వమంటే.. అని కొందరు అంటుండగా.. అందుకే నువ్వు మాకు దేవుడు ఆయ్యవయ్యా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్ షేర్ చేస్తూ ఆ వ్యక్తిత్వం కు చప్పట్లు అంటూ చెప్పుకొచ్చాడు. మీరూ ఆ వీడియోని చూడండి.
సినిమాల విషయానికి వస్తే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “హరి హర వీర మల్లు”. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. “హరిహర వీర మల్లు” సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు మరోసారి పదును పెడుతున్న విషయం తెలిసిందే.