#TilluSquare: సిద్దు ‘టిల్లు స్వ్కేర్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌

Published : Jan 20, 2024, 08:14 AM IST
 #TilluSquare:  సిద్దు ‘టిల్లు స్వ్కేర్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌

సారాంశం

మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి ‘టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square) వచ్చేస్తున్నాడు.

 ‘డీజే టిల్లు’ (DJ Tillu) సీక్వెల్ రిలీజ్ కు రంగం సిద్దమైంది. . సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)హీరోగా వచ్చిన  ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఎక్సపెక్టేషన్స్ కు మించి సక్సెస్  సాధించిన ఆ చిత్రం మంచి వసూళ్లనూ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ రెడీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దాని కొత్త రిలీజ్‌ డేట్‌ బయిటకు వచ్చింది. అయితే అఫీషియల్ గా ఇంకా నిర్మాణ సంస్ద ప్రకటించలేదు కానీ ట్రేడ్ లో ఇదే సర్కులేట్ అవుతోంది. ఆ డేట్ ఏమిటంటే...

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా  తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ను 2023 దీపావళికి ప్రకటించారు. అప్పటి నుంచి ఏదో ఒక అప్‌డేట్‌తో సందడి చేస్తూనే ఉన్నారు. ఇక ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత పోస్ట్‌ పెట్టారు. అయితే గుంటూరు కారం ఎడ్జెస్ట్ మెంట్స్ కోసం ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ మార్చి 30 అని తెలుస్తోంది. 

‘మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి ‘టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square) వచ్చేస్తున్నాడు. మొదటి పార్ట్‌ను మించి వినోదాన్ని పంచనున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనున్నాడు’ అని టీమ్ చెప్తోంది.  

రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఈ యంగ్‌ హీరో సరసన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్‌ పార్ట్‌లో రాధిక పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక దీనితో పాటు నీరజ కోన దర్శకత్వంలో  సిద్ధు జొన్నలగడ్డ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. రీసెంట్ గా దీని షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే నందినిరెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్