లవ్‌ బర్ద్స్ సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ జోడీగా సినిమా.. `హరిలో రంగ హరి`.. నెట్‌ ఫ్లిక్స్ లీక్‌..

Published : Jan 15, 2024, 02:44 PM IST
లవ్‌ బర్ద్స్ సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ జోడీగా సినిమా.. `హరిలో రంగ హరి`.. నెట్‌ ఫ్లిక్స్ లీక్‌..

సారాంశం

సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ జంటగా సినిమా రాబోతుంది. పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నెట్‌ ఫ్లిక్స్ లీక్‌ చేసింది. టైటిల్‌  కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ క్రేజీ లవ్‌  బర్డ్స్ గా రాణిస్తున్నారు సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ. తమ రిలేషన్‌షిప్‌ దాస్తూ చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతున్నారు. పైకి చెప్పడం లేదుగానీ ఈ ఇద్దరు కలిసి చాలా సందర్భాల్లో మీడియాకి చిక్కారు. విదేశాల్లోనూ కలిసి కనిపించారు. మొత్తానికి ఘాటు  రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ కలిసి సినిమా చేయబోతున్నారు. యంగ్‌ డైరెక్టర్‌  పవన్‌ సాధినేని దర్శకత్వంలో వీరిద్దరు  సినిమా చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఈ విషయాన్ని ఈ ఓటీటీ మాధ్యమం లీక్‌ చేసింది. సంక్రాంతి సందర్భంగా వరుసగా తమ ఓటీటీ డీల్‌ కుదుర్చుకున్న సినిమాల లిస్ట్ విడుదల  చేసింది. అందులో ఈ మూవీని కూడా ప్రకటించడం విశేషం. 

అయితే ఈ మూవీకి `హరిలో రంగ హరి` అనే క్రేజీ టైటిల్‌ని పెట్టడం విశేషం. ఈ మూవీని గురూ ఫిల్మ్స్, క్రాస్‌ పిక్చర్స్ పతాకాలపై సునీత తాటి, హ్యూవూ థామస్‌ కిమ్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ ఓ కొరియన్‌ చిత్రానికి రీమేక్‌ అని  తెలుస్తుంది. గతంలో `ఓ బేబీ` వంటి చిత్రాలను ఈ నిర్మాతలు నిర్మించారు. అది కొరియన్‌ మూవీకి రీమేక్‌.  మళ్లీ అదే కాంబినేషన్‌ అంటే ఇది కూడా రీమేకే అని భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

అదితి రావు హైదరీ ప్రస్తుతం `గాంధీ టాక్స్` అనే సైలెంట్ మూవీ చేస్తుంది. దీంతోపాటు `లయనెస్‌` అనే సినిమాలో నటిస్తుంది. ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇక  సిద్ధార్థ్‌ `ఇండియన్‌2`తోపాటు మరో సినిమా చేస్తున్నాడు. ఇక అజయ్‌ భూపతి రూపొందించిన `మహా సముద్రం` సినిమా  సమయంలో ఈ ఇద్దరుప్రేమలో పడ్డారు. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌