Sid Sriram:స్టార్‌ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ గురించి ఈ వార్త షాకే

Surya Prakash   | Asianet News
Published : Jan 08, 2022, 07:23 AM IST
Sid Sriram:స్టార్‌ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ గురించి ఈ వార్త షాకే

సారాంశం

. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో మొదలైన సిద్‌ తెలుగు పాటల ప్రస్థానం.. పుష్ప వరకు కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన అద్భుత గాత్రంతో ఆకట్టుకుంటూ వస్తోన్న సిద్‌ శ్రీరామ్‌ ఇప్పుడు కొత్త అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది.


 మెలోడియస్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు  సింగర్ సిద్ శ్రీరామ్. అల వైకుంఠపురంలో అతడు పాడిన ‘‘ సామజవరగమన’’ పాట ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. గీతా గోవిందంలోని  ‘ఇంకేం ఇంకేం కావాలే..’ ,ఆ తర్వాత ‘మాటే వినదుగ వినదుగ’ అని పాడితే జనం మైకంలో పడిపోయారు. ఈ మధ్యకాలంలో అతను పాడిన ప్రతీ పాట సెన్సేషన్‌.  

అతి  తక్కువ టైమ్ లో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సిద్‌ శ్రీరామ్‌.. మెలోడియస్‌ గీతాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. తమిళనాడులో జన్మించి అమెరికాలో పెరిగిన శ్రీరామ్‌ తెలుగులో తనదైన శైలిలో పాటలు పాడుతూ శ్రోతలను మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో మొదలైన సిద్‌ తెలుగు పాటల ప్రస్థానం.. పుష్ప వరకు కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన అద్భుత గాత్రంతో ఆకట్టుకుంటూ వస్తోన్న సిద్‌ శ్రీరామ్‌ ఇప్పుడు కొత్త అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది.

‘‘ కడల్’’ సినిమాతో సింగర్‌గా సిద్ శ్రీరామ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ‘‘ వానం కొట్టత్తుం ’’ సినిమాకు సిద్ శ్రీరామ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మణిరత్నం నిర్మాతగా వ్యవహరించారు. ధనశేఖరన్ దర్శకత్వం వహించారు. మణిరత్నం సినిమాలతోనే సిద్ శ్రీరామ్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మణిరత్నం సినిమాతోనే సిద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తమిళ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలోనా లేదా అతడు నిర్మించబోయే చిత్రంతోనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరో ప్రక్క ఈ  సింగర్ కాస్తా కంపోజర్‌ అయ్యారు. మణిరత్నం ‘కడల్‌’ సినిమాతో సింగర్‌గా మారిన సిడ్‌ ఇప్పుడు మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా ద్వారానే సంగీత దర్శకుడిగా మారనున్నారు. విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా ధన దర్శకత్వంలో మణిరత్నం నిర్మించనున్న చిత్రం ‘వానమ్‌ కొట్టట్టుమ్‌’. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు సిడ్‌ శ్రీరామ్‌. తొలుత ఈ సినిమాకు ‘96’ ఫేమ్‌ గోవింద్‌ వసంత సంగీత దర్శకుడు. డేట్స్‌ క్లాష్‌ కావడంతో సిడ్‌ శ్రీరామ్‌ ట్యూన్స్‌ అందించడానికి రెడీ అయ్యారు.

Also Read: Shyam Singha Roy: నాని ‘శ్యామ్ సింగ రాయ్’ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు