Shruti Haasan: ప్రేమంటే హ్యాపీ... పెళ్లంటే ఆందోళన అంటున్న శృతి..!

Published : May 26, 2022, 05:20 PM IST
Shruti Haasan: ప్రేమంటే హ్యాపీ... పెళ్లంటే ఆందోళన అంటున్న శృతి..!

సారాంశం

మై లైఫ్ మై రూల్స్... షార్ట్ గా చెప్పాలంటే శృతి హాసన్ లైఫ్ స్టైల్ ఇది. స్టార్ కిడ్ అయినప్పటికీ వ్యక్తిగతమైన, వృత్తిపరమైన నిర్ణయాలే తానే తీసుకుంటుంది. డేరింగ్ లేడీ గా పేరున్న శృతి పెళ్లంటే మాత్రం భయపడుతుంది.

కెరీర్ బిగినింగ్ నుండి శృతి (Shruti Haasan) నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఓ సౌత్ ఇండియా అమ్మాయి, అది కూడా ఓ స్టార్ కిడ్ కూతురు అయ్యుండీ... షాకింగ్ రోల్స్, శృంగార సన్నివేశాల్లో ఆమె నటించారు. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఓపెన్ గా రిలేషన్స్ నడిపారు. ముఖ్యంగా లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. విదేశీయానాలు, విందులు విహారాలు చేశారు. మైఖేల్ తో శృతి వివాహం లాంఛనమేనని అందరూ భావించారు. అనూహ్యంగా ఈ జంట 2019లో విడిపోయారు. 

మైఖేల్ కోసం కెరీర్ ని కూడా వదిలేసిన శ్రుతికి అదో పెద్ద షాక్. బ్రేకప్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి  మరో వ్యక్తితో రిలేషన్ స్టార్ట్ చేశారు. ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక ప్రేమలో పడ్డారు శృతి. వీరిద్దరూ ప్రస్తుతం అక్కడ ఓకే ఇంటిలో ఉంటున్నారు. ప్రేమలు కొనసాగిస్తున్న శ్రుతిని పెళ్లి గురించి అడిగితే కంగారు పడుతున్నారు. ఎందుకో పెళ్లంటే నాకు ఆందోళన అంటున్నారు. పెళ్లి వద్దనుకుంటే ప్రేమలు ఎందుకు అనేది అసలు సమస్య. 

శృతి పేరెంట్స్ కమల్-సారిక ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయారు. ఈ కారణం చేతనే పెళ్లి వద్దనుకుంటున్నారా? అని అడిగితే కాదని సమాధానం చెబుతున్నారు. అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పటికీ కలిసి ఉన్నంత కాలం సంతోషంగా ఉన్నారు. నా భయానికి వాళ్లకు సంబంధం లేదని శృతి అంటున్నారు. ఇద్దరు కలిసి జీవించడాన్ని అధికారికం చేయడమే పెళ్లి. కలిసి జీవించడానికి, పెళ్లి చేసుకోవడానికి పెద్ద తేడా లేదు. కాకపోతే పెళ్ళైతే విడిపోవాలంటే చట్టబద్ధత కావాలి. ప్రేమలు రిలేషన్స్ లో అవేమీ ఉండవు. స్వేచ్ఛగా వద్దనుకున్నప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. 

శాంతనుతో కలిసి జీవిస్తున్న శృతి అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పక పోవడం విడ్డూరం. ఇక అమ్మడు కెరీర్ కూడా ట్రాక్ లో పడింది. బడా బడా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ప్రభాస్ సలార్, చిరు 154, బాలయ్య 107 చిత్రాల్లో శృతి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?