Shruti Haasan:తన ఆరోగ్య సమస్య లు చెప్పి షాక్ ఇచ్చిన శృతి,ఫ్యాన్స్ కంగారు

Published : Jul 02, 2022, 10:05 AM IST
Shruti Haasan:తన ఆరోగ్య సమస్య లు చెప్పి షాక్ ఇచ్చిన శృతి,ఫ్యాన్స్ కంగారు

సారాంశం

నా శారీరక ఆరోగ్యం సరిగా లేదు కాని నా మనసు చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల నేను సంతోషంగా ఉంటున్నాను అంది.  నేను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. ఎండోమెట్రియోసిస్ వంటి పలు హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను.  


ఆనందంగా  జీవితాన్ని సాగిస్తున్న శృతి హాసన్ ఎవరూ ఊహించని విధంగా తన అనారోగ్య సమస్యల గురించి చెప్పి అందరిని  షాక్ కి గురి చేసింది. హార్మోన్ లోపం కారణంగా తాను ఇబ్బంది పడుతున్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ లో శృతి హాసన్ ఒక వర్కౌట్ వీడియోను షేర్ చేసి ఆ వీడియో తో పాటు తన అనారోగ్య సమస్యలను వెళ్లడించింది. 

నాలా మీరు వర్కౌట్స్ చేయండి. ప్రస్తుతం నేను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. ఎండోమెట్రియోసిస్ వంటి పలు హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను.  వాటి వల్ల జీవక్రియ సరిగా ఉండక పోవడంతో పాటు ఉబ్బరంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మహిళలకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయాలి. ప్రతి రోజు మినిమం గా వర్కౌట్స్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం దక్కుతుంది. నా శారీరక ఆరోగ్యం సరిగా లేదు కాని నా మనసు చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల నేను సంతోషంగా ఉంటున్నాను అంది. 

కెరీర్ విషయానికి వస్తే ...వరస ఫ్లాప్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయిన ఈ హీరోయిన్ క్రాక్ తో కమ్ బ్యాక్ అనిపించుకుంది. ఆపై చిన్న రోల్ చేసినా పవన్ వకీల్ సాబ్ హిట్.. తన లిస్ట్ లోకి చేరిపోయింది. శృతి హాసన్ కు ప్రస్తుతం హిట్ ఫేజ్ నడుస్తోంది.  ఈ హీరోయిన్ వరుసగా సీనియర్ హీరోలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రుతినే హీరోయిన్. కాగా రీసెంట్ గా చిరూ 154వ ప్రాజెక్ట్ కూడా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేసింది. బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్ అని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. బాలయ్య, చిరూ ఇద్దరితో శ్రుతీ నటిస్తోన్న ఈ సినిమాలను ప్రొడ్యూస్ చేసేది మైత్రీ మూవీ మేకర్స్.
 
ఇక లేటెస్ట్ గా ప్రభాస్ సరసన ఆఫర్ అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచింది శ్రుతీహాసన్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ఆమె క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండబోతుంది.  అమెజాన్ లో రిలీజైన బెస్ట్ సెల్లార్ వెబ్ సిరీస్ కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్