చంద్రబాబుపై పోటీ విషయంలో స్పందించిన హీరో విశాల్, ఏమన్నారంటే...?

Published : Jul 02, 2022, 08:02 AM IST
చంద్రబాబుపై పోటీ విషయంలో స్పందించిన హీరో విశాల్, ఏమన్నారంటే...?

సారాంశం

ఈ మధ్య సోషల్ మీడియాను కుదిపేసిన అంశం ఒకటుంది. అదేమిటంటే.. హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ.. అది కూడా ఆంధ్ర ప్రదేశ్ నుంచి.. అది కూడా విపక్షనేత  చంద్రబాబు నాయుడు మీద పోటీగా. ఇక ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు విశాల్. 

హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ.. అది కూడా తమిళనాడు నుంచి కాదు... ఆంధ్రా నుంచి.  అది కూడా వైసీపీ నుంచి.. ఈ విషయం గత కొంత కాలంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  మరో విషయం ఏంటీ అంటే వైసీపీ విశాల్ ను ప్రతిపక్షనేత చంద్రబాబుకు పోటీగా దించబోతోంది అన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఈ మధ్య కాలంలో అంతగా ఇంట్రెస్టింగ్ గా గమనిస్తున్న వార్త ఇదే. ఎలాఅయినా చంద్రబాబును కుప్పంలో ఓడించాలని చూస్తోన్న వైసీపీ.. విశాల్ ను రంగంలోకి దించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో స్వయంగా    విశాలే క్లారిటీ ఇచ్చారు. 

తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగువారు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన తండ్రి చెన్నైలో సెటిల్ అయిన ఆంధ్ర వ్యక్తి.  చిత్తూరుకు చెందిన ఈ ఫ్యామిలీ...ప్రస్తుతం చెన్నై లో సెటిల్ అయ్యారు. చెన్నైలో బిజినెస్ లు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. అయినా సరే వారికి ఏపీ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ తో కూడా విశాల్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. విషయం బహిరంగంగా వైఎస్ జగన్ ను పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఈ నేపథ్యంలో హీరో విశాల్ 2024 ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు  చంద్రబాబు పై పోటీ చేస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి.  వైసిపి తరపున కుప్పం లో విశాల్ భరిలోకి దిగుతారు అనే వార్తలు గత కొద్ది రోజులు గా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే. ఈ వార్తలు ఎక్కువ అవ్వడం తో విశాల్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన  విశాల్… ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. 

 

ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నా అంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అసలు ఈ వార్తలు ఎక్కడ పుట్టాయో కూడా అర్థం కావడంలేదు. నేను ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నా నన్ను పోటిచేయమని కూడా ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం నాదృష్టి మొత్తం సినిమా ల పైనే ఉంది. ఏపి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. అంటూ విశాల్ ట్విట్టర్ లో లాంగ్ నోట్ రాశారు. 

ఇక ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విశాల్... గతంలో చెన్నైలో ఒ నియోజకవర్గం నుంచి స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే  లెక్షన్ లో ఓడిపోయినప్పటికీ.. విశాల్ కు ఓటింగ్ గట్టీగానే వచ్చింది. దాంతో ముందు ముందు రాజకీయాల్లోకి విశాల్ వస్తారన్న అభిప్రాయం అందరిలో బలంగా నాటుకుపోయింది. ఆంధ్ర వ్యాక్తి కావడంతో ఆయన ఇక్కడ పాలిటిక్స్ ను కూడా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా