ఓరిపై మండిపడిన శ్రుతి హాసన్, శాంతనుతో పెళ్లి వార్తలపై క్లారిటీ..

Published : Dec 30, 2023, 12:28 PM ISTUpdated : Dec 30, 2023, 12:32 PM IST
ఓరిపై మండిపడిన శ్రుతి హాసన్, శాంతనుతో పెళ్లి వార్తలపై క్లారిటీ..

సారాంశం

శ్రుతి హాసన్ మండిపడ్డారు. తన గురించి పిచ్చిగా వాగిన ఓరిపై ఫైర్ అయ్యింది.  అంతే కాదు తన పెళ్ళి పై వస్తున్న వార్తలకు కూడా క్లారిటీ ఇచ్చింది శృతీ హాసన్ ఇంతకీ ఆమె నిజంగా పెళ్లి చేసుకుందా..?   


ఈమధ్య  శ్రుతిహాసన్ పెళ్లి గురించి రకరకాల  రూమర్స్  వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. శ్రుతి  తన ప్రియుడు శంతను హజారికను సీక్రెట్ గా పెళ్ళాడినట్టు న్యూస్ హైలెట్ అయ్యింది. అయితే ఈ విషయం రూమర్ గా బయటకురాలేదు. పర్టిక్యూలర్ గా ఓ సోషల్ మీడియా సెలబ్రిటీ వల్ల వచ్చింది.  సోషల్ మీడియా ఇన్‏ఫ్లుయేన్సర్ ఓరీ చేసిన కామెంట్లతో శ్రుతి పెళ్లి  వార్తలు తెరపైకి వచ్చాయి. శృతీ హాసన్ మీద కోపంతతో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఓరీ. 

ఈమద్య ఓరీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ..  శ్రుతిహాసన్ తనతో సరిగ్గా ప్రవర్తించలేదని..తనతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో రూడ్ గా ప్రవర్తించిందని.. ఆమె భర్తతో తను క్లోజ్ గా ఉండటం శృతికి నచ్చి ఉండకపోవచ్చు.. అందుకే ఇలా చేసిందేమో అని అన్నారు ఓరి. శ్రుతిహాసన్ ప్రియుడు శంతను హజారికను బర్తగా ఓరి సంబోధించడంతో వారి పెళ్ళిపై తెలియకుండానే అతను కామెంట్ చేసినట్టు అయ్యింది. దాంతో ఆమె నిజంగా శాంతను ను పెళ్లి చేసుకుందేమో అన్న అనుమానాలు బలపడ్డాయి. అంతే కాదు.. ఈపని అతను కావాలనే చేశాడంటూ కామెంట్లు కూడా వినిపించాయి. 

అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ శ్రుతి హాసన్.   తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.  తనకు పెళ్లి కాలేదని.. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే తాను.. ఈ విషయం ఎందుకు దాచిపెడతాను అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో శ్రుతి పెళ్లి రూమర్లకు చెక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి మ్యారేజ్ రూమర్స్ పై స్పందించింది శ్రుతి. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ మాట్లాడుతూ..నేను అద్దంలాంటి మనిషిని. ప్రజలు నాతో ఎలా ప్రవర్తిస్తారో… నేను అలాగే ప్రవర్తిస్తాను. నేనెప్పుడు వేటి గురించి బాధపడను.. పీస్ ఫుల్ గా ఉండే వ్యాక్తులతో గడపడానికి ఇష్టపడతాను. 

ఇక తనకు ఓరి ఎవరో తెలియదన్నారు శృతి హాసన్.  నేను నా పని చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతూ బిజీగా ఉన్నాను. అటువంటి వారిని అస్సలు పట్టించుకోను..అన్నట్టు మాట్లాడారు శ్రుతి. నా గురించి తెలియని వారు మాట్లాడకూడదని కోరుకుంటున్నాను. నేను పూర్తిగా ఒంటరిగా నిజాయితీతో నా జీవితాన్ని గడిపాను. నాకు పెళ్లయితే ఎందుకు దాచిపెడతాను? ఈ వార్తతో నా సోషల్ మీడియాలో వైరల్ అయినందుకు నేను ఒక క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశాను. అది సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. రీసెంట్ గా ఆమె సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ సాధించింది బ్యూటీ లక్కీ హీరోయిన్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?