స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బర్త్ డే.. ఈ అరుదైన వీడియోను చూశారా?

By team telugu  |  First Published Jan 28, 2023, 3:45 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె పుట్టిన రోజు ఇవ్వాళే కాబట్టి. ఈ సందర్భంగా శృతి హాసన్ కు ఎంతో ఇష్టమైన ఓ అరుదైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన టాలెంట్, పెర్ఫామెన్స్, అందంతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన ఫ్యాన్స్ కు శృతి హాసన్ సర్ ప్రైజ్ ఇస్తుంటే.. ఫ్యాన్సే తనను సర్ ప్రైజ్ చేశారు. గతేడాది ఓ అరుదైన వీడియోను పంపి సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం మళ్లీ ఆ వీడియో వైరల్ అవుతోంది. 

గతేడాది తనే పంచుకున్న ఆ వీడియోను నోట్ లో వివరించారు.  ‘ఇదోక అందమైన జ్ఞాపకం. నా మొట్టమొదటి సింగింగ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇది. చిన్న ఇంట్రడక్షన్  కోసం  నాన్న, అమ్మ, నేను రిహార్సల్ చేశాం! అందుకు ఆడియెన్స్ చప్పట్ల శక్తిని నేను అనుభవించిన క్షణం అది. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చినందుకు, ఎల్లప్పుడూ కళను నా జీవితంలో ఒక భాగం చేసినందుకు మరియు సింగపూర్‌లోని ప్రత్యేక ప్రేక్షకులకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. వీరు నా మొట్టమొదటి ప్రేక్షకులు. అలాగే ఈ అరుదైన వీడియోని వెతికి నాకు అందించినందుకు @shrutihaasan_fanzzoneకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నా పుట్టిన రోజును రోజున మరింత సంతోషం కలిగించారు.’ అని పేర్కొంది.  

Latest Videos

ఈ వీడియోలో చిన్నప్పటి శృతి హాసన్ క్యూట్ గా పాడి అందరినీ ఆకట్టుకుంది. దీంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. మళ్లీ ఫ్యాన్స్ ఆ వీడియోను గుర్తు చేసుకుంటుండటం విశేషం. చిన్నప్పటి నుంచే ఎంత టాలెంటెడ్ అంటూ పొగిడేస్తున్నారు. స్టార్ హీరోయిన్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా శ్రుతి హాసన్ ఏకంగా రెండు చిత్రాలతో అలరించింది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’తో సందడి చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ‘ది ఐ’ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లోనూ శృతి భాగం కావడం విశేషం.

 

click me!