నేను వాటికి పనికిరాను.. ఆ అర్హత కూడా నాకు లేదు: శ్రియా కామెంట్స్!

Published : Sep 01, 2018, 12:17 PM ISTUpdated : Sep 09, 2018, 12:40 PM IST
నేను వాటికి పనికిరాను.. ఆ అర్హత కూడా నాకు లేదు: శ్రియా కామెంట్స్!

సారాంశం

ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అగ్ర హీరోలందరితో జోడీ కట్టిన నటి శ్రియా ఇప్పటికీ నటిగా కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటిస్తోంది.

ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అగ్ర హీరోలందరితో జోడీ కట్టిన నటి శ్రియా ఇప్పటికీ నటిగా కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆమె నటించిన 'నరగాసూరన్' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిందని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఈ బ్యూటీ కొన్ని విషయాలపై చర్చించింది. స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి, జయప్రద వంటి నటీమణులులానే మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా శ్రియ ''నేను రాజకీయాలకు అస్సలు పనికి రాను.

రాజకీయాల్లోకి రావాలంటే చాలా తెలిసుండాలి. నాకు వాటిపై కనీసం అవగాహన కూడా లేదు. నాకు రాజకీయ అర్హత కూడా లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక శివాజీ సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటించడం తన భాగ్యమని రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడింది. 

ఇది కూడా చదవండి.. 

ముఖాన్ని దాచేసిన శ్రియ.. కారణం ఏంటో..?
  

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు