నా వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకోను.. శ్రియా కామెంట్స్!

Published : Oct 26, 2018, 04:59 PM IST
నా వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకోను.. శ్రియా కామెంట్స్!

సారాంశం

సినిమా వాళ్ల మీద ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల కంటే వారి వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా వారి కుటుంబ వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలపై ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

వారు చెప్పకపోయినా.. ఏదోక విధంగా వార్తలు బయటకొస్తూనే ఉంటాయి. హీరోయిన్ శ్రియాకి ఇటీవల పెళ్లైన సంగతి తెలిసిందే. తన పెళ్లి విషయాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నించినా.. ఆ విషయాన్ని దాచి ఉంచలేకపోయింది. ఇప్పుడు తన భర్త గురించి చెప్పమని అడిగితే ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

రష్యాకి చెందిన ఆండ్రీ కోస్చీవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది శ్రియా. అతడి గురించి ఇక్కడ ప్రేక్షకులకి అవగాహన లేకపోవడంతో మీడియా ముందుకు వచ్చిన ఆమెకి తన భర్తకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి సమాధానంగా నా వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకోను అంటూ ఆమె కామెంట్ చేసింది.

దీన్ని బట్టి తన పెర్సనల్ విషయాలను బయటకి చెప్పడానికి శ్రియా ఎంతమాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. సినిమాలు, ప్రొఫెషన్ కి సంబంధించి ఏ విషయాన్నైనా మాట్లడతానని, వ్యక్తిగత విషయాల గురించి మాత్రం మాట్లాడనని తేల్చి చెప్పింది. 
 
PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా