శ్రియ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

Published : Feb 27, 2018, 05:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
శ్రియ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

సారాంశం

శ్రియ పెళ్లికి ముహూర్తం ఖరారు మార్చి 17,18,19 తేదీల్లో వివాహం యాండ్రీ కొశ్చీవ్ అనే రష్యన్ తో పెళ్లి

ఇష్టం సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు పరిశ్రమలోనే కాక దక్షిణాదిలో అగ్రతారల్లో ఒకరిగా వెలుగొందుతూ.. దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరను ఏలిన, ఇంకా ఏలుతున్న తార శ్రియ. గత కొంతకాలంగా శ్రియ పెళ్లికి సంబంధించిన వార్తలు గుప్పుమంటున్నా... ఎక్కడా శ్రియ కన్ఫమ్ చేయలేదు. అయితే తాజాగా శ్రియ పెళ్లికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. ముంబై బ్లాగ్ లో శ్రియను ఉటంకిస్తూ వార్త ప్రచురితమైంది.

 

యాండ్రీ కొశ్చీవ్ అనే రష్యన్ స్పోర్ట్స్ పర్సన్ కమ్ బిజినెస్ మాన్ ను  వివాహం చేసుకోబోతోంది. మార్చి 17,18,19 తేదీలల్లో ఉదయ్ పూర్ లో జరిగే వివాహ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. తన పెళ్లి విషయానికి సంబంధించిన ప్రశ్నలపై ఎప్పుడూ దాటవేస్తూ వుండే శ్రియ.. హోలీ థీమ్ లో వివాహం, మెహందీ, సంగీత్ వేడుకలతో గ్రాండ్ గా పెళ్లిచేసుకోబోతోంది. ఇప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్ కు తన పెళ్లికి సంబంధించిన ఆహ్వానాలు ఫోన్ లో చేరవేసింది శ్రియ. ఇక ఉదయ్ పూర్ లో జరిగే ఈ వివాహానికి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి