సమంతని కాదనుకొని శ్రద్ధాకి ఛాన్స్!

Published : May 16, 2019, 02:14 PM IST
సమంతని కాదనుకొని శ్రద్ధాకి ఛాన్స్!

సారాంశం

'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ, కన్నడ భాషల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. 

'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ, కన్నడ భాషల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన 'జెర్సీ' సినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోయిన్ సమంతపై కామెంట్ చేసింది శ్రద్ధా.

కన్నడలో శ్రద్ధా నటించిన 'యూటర్న్' సినిమాను తెలుగులో సమంత రీమేక్ చేసింది. అయితే తన పాత్రలో సమంతని చూడలేకపోయానని, తనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. దీంతో సమంత అభిమానులు శ్రద్ధాపై విరుచుకుపడ్డారు. 

ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా సమంతను రీప్లేస్ చేసి ఆమె ఛాన్స్ ని కొట్టేసింది. విశాల్, సమంత నటించిన 'ఇరుంబు తిరై' గతేడాది విడుదలై సక్సెస్ అందుకుంది. తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో సినిమాను విడుదల చేశారు.

ఇప్పుడు దానికి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోగా విశాల్ కొనసాగుతాడు. కానీ హీరోయిన్ గా సమంతకి బదులు శ్రద్ధా శ్రీనాథ్ ని తీసుకున్నారు. ఇప్పటికే అజిత్ తో కలిసి 'పింక్' రీమేక్ లో నటిస్తోన్న శ్రద్ధా ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 
 

PREV
click me!

Recommended Stories

3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడు జబర్దస్త్‌లో చేరమని పదేపదే కోరారు.. కానీ.! ఆ తర్వాత జరిగిందిదే: బలగం వేణు