అతిలోక సుందరి నటించిన `నాగిని` పాత్రలో ప్రభాస్‌ హీరోయిన్‌

Published : Oct 28, 2020, 04:02 PM ISTUpdated : Oct 28, 2020, 04:06 PM IST
అతిలోక సుందరి నటించిన `నాగిని` పాత్రలో ప్రభాస్‌ హీరోయిన్‌

సారాంశం

బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని కొట్టేసింది. పాపులర్‌ పాత్రలో కనిపించబోతుంది. చాలా శక్తివంతమైన పాత్రలో నటించబోతుంది. `నాగిని`గా మెస్మరైజ్‌ చేయబోతుంది. 

గతేడాది `సాహో`తో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసిన బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని కొట్టేసింది. పాపులర్‌ పాత్రలో కనిపించబోతుంది. చాలా శక్తివంతమైన పాత్రలో నటించబోతుంది. `నాగిని`గా మెస్మరైజ్‌ చేయబోతుంది. 

విశాల్‌ ఫురియా దర్శకత్వంలో, నిఖిల్‌ ద్వివేది నిర్మిస్తున్న ట్రయాలజీ చిత్రంలో నటించబోతుంది. ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి నటించిన `నాగిని`గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. `చిన్నప్పటి నుంచి శ్రీదేవి `నాగినా, `నాగినా 2` సినిమాలను చూస్తూ పెరిగాను. `నాగిని`గా శ్రీదేవి నటన ఓ ల్యాండ్‌మార్క్ గా నిలిచిపోయింది. సాంప్రదాయ జానపద చిత్రాలకు నాంది పలికిన అలాంటి శక్తివంతమైన పాత్రతో తెరపై కనిపించబోతున్నందుకు ఆనందంగా ఉంది` అని ట్వీట్‌ చేసింది శ్రద్ధా. శ్రద్ధా ఈ ఏడాది `బాఘి 3`, `స్ట్రీట్‌ డాన్స్ 3డి` చిత్రాలతో మెప్పించబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు