Dharmapuri: గౌడ కులస్తులు అభ్యంతరం... ఆ సన్నివేశాలు తొలగింపు..

Surya Prakash   | Asianet News
Published : Apr 19, 2022, 03:39 PM IST
Dharmapuri: గౌడ కులస్తులు అభ్యంతరం... ఆ సన్నివేశాలు తొలగింపు..

సారాంశం

ట్రైలర్‌లో గౌడన్న ముఖము మీద కళ్ళు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు, సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటగా అ సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు తెలిపింది యూనిట్‌.

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘1996 ధర్మపురి’. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా నటించిన ఈ చిత్రం 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు జగత్. 

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ 1996 ధర్మపురి..’. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ లో ఓ షాట్ పట్ల గౌడ కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దాంతో ఆ షాట్ ని తొలిగించామని టీమ్ ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.  అందులో ఏముందంటే..

గత 2 రోజులుగా మా `ధర్మపురి` మూవీ లోని ట్రైలర్‌ గౌడన్న ముఖము మీద కళ్ళు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు , సోదరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మొదటగా అ సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాము. ఆ సన్నివేశం ట్రైలర్ లో,  సినిమా లో తొలగించడం జరిగింది అని మీకు తెలియజేస్తున్నాము. మరియు మిగతా సినిమా లో అన్ని సన్నివేశాలు గీత కార్మికుల, గౌడన్న ల వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా మా సినిమా ఉంటుంది. దయచేసి మన గౌడ సంఘాల పెద్దలు, గీత కార్మిక సహోదరులు అందరూ... కొత్తగా వస్తున్న మాయొక్క సినిమా ను , మమ్మల్ని  అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు.

 చిత్ర స‌మ‌ర్ప‌కుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ క‌థ చెప్పిన‌రోజే చెప్పాను ఈ సినిమా అంద‌రి హృద‌యాల‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని, అందుకే నేను ఈ చిత్రంలో పార్ట‌య్యాను. ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడైన మారుతిగారికి ఈ సినిమా న‌చ్చ‌డం అంటే తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి సినిమా న‌చ్చుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్‌గా చాలా నేచుర‌ల్ ఫెర్‌ఫార్మెన్స్‌తో ప్ర‌తి ఓక్క‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా రాశారు. సాంగ్స్ విష‌యానికొస్తే ఇప్ప‌టికే రెండు సాంగ్స్ ప్రేక్ష‌కులకి నచ్చేశాయి. సినిమా ఎండ్ కార్డ్ ప‌డ్డాక సూరి, మ‌ల్లి పాత్ర‌లు మీతోనే థియేట‌ర్ బ‌య‌ట‌కి ట్రావెల్ అవుతాయి. ఓషో వెంక‌టేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద మ్యాజిక్ చేసింది. ఏప్రిల్ 22 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం..’’ అని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌