అజిత్ ఆన్ స్క్రీన్ డాటర్, బుట్టబొమ్మ హీరోయిన్ మరణించినట్లు రూమర్స్, అసలేం జరిగిందంటే..

Published : May 10, 2023, 11:35 AM IST
అజిత్ ఆన్ స్క్రీన్ డాటర్, బుట్టబొమ్మ హీరోయిన్ మరణించినట్లు రూమర్స్, అసలేం జరిగిందంటే..

సారాంశం

చాలా మంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి ఆ తర్వాత హీరోయిన్లుగా మారుతున్నారు. వారిలో అనికా సురేంద్రన్ ఒకరు. ఈ యంగ్ అండ్ క్యూట్ బ్యూటీ తలా అజిత్ విశ్వాసం చిత్రంలో అతడి కుమార్తెగా అద్భుతంగా నటించింది.

చాలా మంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి ఆ తర్వాత హీరోయిన్లుగా మారుతున్నారు. వారిలో అనికా సురేంద్రన్ ఒకరు. ఈ యంగ్ అండ్ క్యూట్ బ్యూటీ తలా అజిత్ విశ్వాసం చిత్రంలో అతడి కుమార్తెగా అద్భుతంగా నటించింది. ఇటీవల అనికా సురేంద్రన్ హీరోయిన్ గా కూడా రాణిస్తోంది. 

రీసెంట్ గా అనికా బుట్టబొమ్మ అనే చిత్రంలో ఫీమేల్ లీడ్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనికా గురించి ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. అనికా మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. మరణించినప్పుడు పత్రికల్లో ఇచ్చే ప్రకటన లాంటిది ఒకటి అందరిని కంగారుకి గురిచేస్తోంది. 

దీనితో అనికాకి ఏమైంది అంటూ అంతా షాక్ అవుతున్నారు. అయితే అనికా మరణించినట్లు వైరల్ అవుతున్న పోస్టర్ పై క్లారిటీ వచ్చింది. ఆ పోస్టర్ నిజమే కానీ.. ఆమె మరణించడం మాత్రం అవాస్తవం. ప్రస్తుతం అనికా నటిస్తున్న ఒక చిత్రానికి సంబంధించిన పోస్టర్ అది. అది కాస్త లీక్ కావడంతో ఆమె నిజంగానే మరణించిందంటూ కొందరు పుకార్లు సృష్టించారు. 

ప్రస్తుతం అనికా సౌత్ అన్ని భాషల్లో అవకాశాలు అందుకుంటోంది. అనికా క్వీన్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఒక మంచి హిట్ పడితే అనికా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్