తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను రూపొందించిన తమిళ దర్శకుడు శంకర్ ఇప్పటివరకు ఒక్క తెలుగు హీరోతో కూడా మూవీ తీయలేదు. తాజాగా శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ నేపధ్యంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన రోజుకో వార్త మీడియాలో ప్రత్యక్ష్యమవుతోంది. తాజాగా మరో ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

అదేమిటంటే.. ఈ సినిమాలో సౌత్ కొరియన్ పాపులర్ హీరోయిన్ Suzy Bae ని ఓ కీలకమైన పాత్రకు తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి ఈ కొరియన్ బ్యూటీ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు శంకర్ కూడా కమల్ హాసన్‌తో చేస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమాను పక్కన పెట్టి మరి ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించడం దాదాపు ఖాయం అయింది. మరోవైపు ఈ సినిమాను శంకర్.. తొమ్మిది నెలల్లో పూర్తి చేయనున్నట్టు సమాచారం. ముందుగా వీరిద్దరి కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పినా.. ఫైనల్‌గా మాత్రం పొలిటికల్ డ్రామా అని చెబుతున్నారు. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది.ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉంది. అందుకే ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరోను సంప్రదించినట్టు సమాచారం.
‘జెంటిల్‌మెన్’తో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమా శంకర్‌కు 15వ సినిమా కావడం విశేషం. అలాగే ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం గమనార్హం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా.
శంకర్ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్‌చరణ్ చేయని సరికొత్త పాత్రలో శంకర్ చెర్రీని చూపించనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో స్టార్ కాస్టింగ్ కూడా భారీగానే ఉండనుంది.