బిగ్ బాస్ 2: కౌశల్ కి డాక్టరేట్ - పీఎంవో కాల్ అంతా అబద్ధమేనా?

By Prashanth MFirst Published 21, Nov 2018, 9:37 PM IST
Highlights

బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ ఎంతగా క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ ఓటింగ్ లో ఊహించని విధంగా నెంబర్ వన్ గా నిలిచాడు. కోట్లాది మంది మద్దతు అందుకున్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అదే విధంగా అతను గెలుచుకున్న 50 లక్షల ప్రైజ్ మనీని క్యాన్సర్ బాధితుల కోసం విరాళమిచ్చి మరింతగా పాపులర్ అయ్యాడు. 

బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ ఎంతగా క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ ఓటింగ్ లో ఊహించని విధంగా నెంబర్ వన్ గా నిలిచాడు. కోట్లాది మంది మద్దతు అందుకున్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అదే విధంగా అతను గెలుచుకున్న 50 లక్షల ప్రైజ్ మనీని క్యాన్సర్ బాధితుల కోసం విరాళమిచ్చి మరింతగా పాపులర్ అయ్యాడు. 

అయితే కౌశల్ పై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా మొదటి నుంచి వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఒక ఛానెల్ డిబేట్ లో కౌశల్ కు సంబందించిన కొన్ని విషయాలు బోగస్ అని తేలింది. తనకు ప్రైమ్ మినిష్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని అలాగే హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా రానుందని గతంలో కౌశల్ వీడియో ద్వారా చెప్పారు. 

అయితే ఛానెల్ లైవ్ లోనే కౌశల్ కి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి డాక్టరేట్ రాలేదని తేలింది. ఇక డాక్టరేట్ వచ్చిందని కథనాలు వెలువడ్డ విషయంపై పూర్తి నిర్ధారణకు యూనివర్సిటీని సంప్రదించగా వారు కౌశల్ ఎవరో తమకు తెలియదని అతని గురించి ఎలాంటి విషయాలు తెలియదని ఆన్సర్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఒక పర్సన్ కౌశల్ కి ఫోన్ చేసి డాక్టరేట్ ఇవ్వాలని ప్రపోజ్ చేసిన విధానాన్ని కౌశల్ చెప్పారు. అతను ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అన్నట్లు వివరణ ఇచ్చాడు. 

ఈ పరిణామాలతో ఒక్కసారిగా కౌశల్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ తో న్యూస్ ని మరింత వైరల్ చేస్తున్నారు.  పీఎంవో ఆఫీస్ నుంచి కాల్ చేసినట్లు చెప్పిన చంద్ర మోహన్ కి  పీఎంవో ఆఫీస్ కి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. అయితే కౌశల్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. ఎంతో మంది తనకు ఫోన్ చేశారని.. పీఎంవో ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని నేను అభిమానులకు చెప్పానని చెబుతూ .. అది అఫీషియల్‌, అన్ అఫీషియల్ అనే విషయం తనకు ఏ విధంగా తెలుస్తుందని అన్నారు. 

కోట్లాది ఓట్లను కొల్లగొట్టి సోషల్ మీడియాలో ఒక ఆర్మీని గెలుచుకున్న కౌశల్ పై ఎన్ని కథనాలు వెలువడినా నిజమని అనుకున్నారు.. ఇక డాక్టరేట్.. ప్రైమ్ మినిష్టర్ ఆఫీస్ నుంచి కాల్.. ఇలా అన్ని విషయాలను నిజమని అనుకున్నారు. కానీ ఇప్పుడు మిస్ కమ్యూనికేషన్ వల్ల ఇలా జరిగిందని కౌశల్ కి ఫోన్ చేసిన వ్యక్తులు చెప్పడం గమనార్హం. అయితే ఈ న్యూస్ కౌశల్ ఫాలోయింగ్ పై ఏ విధమైన ప్రభావం చూపెడుతుందో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

Last Updated 21, Nov 2018, 9:58 PM IST